Madapur Ganesh Laddu Auction: మరోసారి రికార్డు ధర పలికిన మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూ
ABN , Publish Date - Sep 04 , 2025 | 02:08 PM
హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా లడ్డూ వేలం పాటలను నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. సిటీలో మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి ఏడాది అంతకంతకూ ఈ లడ్డూ ధర రికార్డ్ బ్రేకవుతోంది.
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నగరంలో వినాయక చవితి ఉత్సవాలు (Vinayaka Chavithi) ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా లడ్డూ వేలం పాటలను నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. సిటీలో మాదాపూర్ మై హోమ్ భుజా గణేష్ లడ్డూకు (Madapur My Home Bhooja Ganesh Laddu) ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రతి ఏడాది అంతకంతకూ ఈ లడ్డూ ధర రికార్డ్ బ్రేకవుతోంది. తాజాగా మాదాపూర్ మై హోమ్ భుజా లడ్డూ ఈ ఏడాది కూడా అధిక ధర పలికింది.
మాదాపూర్ మై హోమ్ భుజాలో లడ్డూ వేలం పాట రికార్డు బ్రేక్ చేసింది. ఈ ఏడాది కూడా హోరా హోరీగా లడ్డూ వేలం పాట సాగింది. రూ.51,77,777కు ధర పలికింది. ఈ ఏడాది లడ్డూను గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కైవసం చేసుకున్నారు. ఆయన ఖమ్మం జిల్లా ఇల్లంద్ గ్రామ వాసి. గత సంవత్సరం రూ.29 లక్షలకు మాదాపూర్ మై హోమ్ భుజా లడ్డూ ధర పలికింది.
గణేష్ నిమజ్జనాలకు బేబీ పాండ్స్ ఏర్పాటు
మరోవైపు.. హైదరాబాద్‌లో గణేష్ మహా నిమజ్జనానికి జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లు సిద్ధం చేసింది. నగర వ్యాప్తంగా 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఫోకస్ లైట్లు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసింది. మూడు విడతల్లో 4వేల మందితో హుస్సేన్ సాగర్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో పరిశుభ్ర పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే గణేష్ విగ్రహాల నిమజ్జనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. ఐదు ఫీట్లలోపు విగ్రహాలను నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌లో నిమజ్జనం చేయాలని అధికారులు చెబుతున్నారు. ట్యాంక్ బండ్‌పై చివరిరోజు మాత్రమే నిమజ్జనాలకు అనుమతి ఇచ్చారు. హెచ్ఎండీఏ, పోలీసులు, ఇతర శాఖలతో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు
గణేష్ నిమజ్జనం కోసం నగరంలో బేబీ పాండ్స్ ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. నగర వ్యాప్తంగా 73 బేబీ పాండ్స్ ఏర్పాటు చేసింది. బేబీ పాండ్స్, ఎక్స్‌వెటెడ్ పాండ్స్, పొర్టబుల్ పాయింట్స్ సిద్ధం చేసింది. పర్యావరణ హిత నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బల్దియా చర్యలు తీసుకుంటుంది. పలు చెరువుల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం తగ్గించడానికి పాండ్స్ ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. 6 అడుగులల్లోపు విగ్రహాలను పాండ్స్‌లో నిమజ్జనం చేసేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
ప్రతి జోన్‌లోనూ బేబీ పాండ్స్ ఏర్పాటు చేసింది. నిమజ్జనం అనంతరం ట్రక్కుల ద్వారా డెబ్రిస్ తరలించేలా చర్యలు చేపట్టింది. 6 అడుగులల్లోపు విగ్రహాలను బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలని ప్రజలను బల్దియా అధికారులు కోరుతున్నారు. ప్రజలు తమ సమీపంలోని బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. చెరువులు, హుస్సేన్ సాగర్‌లో నేరుగా నిమజ్జనం చేయొద్దని సూచించారు జీహెచ్ఎంసీ అధికారులు. బేబీ పాండ్స్ వద్ద లైటింగ్‌తో పాటు ప్రత్యేక సిబ్బంది, భద్రతా సిబ్బందిని నియమించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం
Read Latest Telangana News and National News