Share News

KTR: తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం

ABN , Publish Date - May 26 , 2025 | 05:41 PM

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత పదేళ్ల తమ హయాంలో రాష్ట్రానికి బలమైన పునాది వేశామని మాజీ మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు నమ్మి బొక్కబోర్ల పడ్డారని చెప్పారు.

KTR: తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం
KTR

హైదరాబాద్: తెలంగాణలో ఉప ఎన్నికలు (By Elections) వస్తే గద్వాల్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరవేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ధీమా వ్యక్తం చేశారు. 200 జెట్‌స్పీడ్‌తో తాము గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శలు చేశారు కేటీఆర్.


ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయ హస్తమని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత పదేళ్ల తమ హయాంలో రాష్ట్రానికి బలమైన పునాది వేశామని ఉద్ఘాటించారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు నమ్మి బొక్కబోర్ల పడ్డారని చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు చూడాలి కాంగ్రెస్ దరిద్రాన్ని అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.


పదిమంది నేతలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారని.. వారికి కర్రు కాల్చివాత పెట్టాలని హెచ్చరించారు మాజీ మంత్రి కేటీఆర్. మనతోనే ఉండి మనకే వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. నాడు నీళ్లు, నిధులు , నియామకాల కోసం ఉద్యమం చేశామని గుర్తుచేశారు. నేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిందలు, దందాలు, చందాలు చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి చాలాసార్లు మాట మార్చారని మండిపడ్డారు. అపరిచితుడు చిత్రంలోని రాము, రెమోలాగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జూన్ మాసంలో బీఆర్ఎస్ మెంబర్ షిప్ ప్రారంభిస్తామని ప్రకటించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్, బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న

బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. వీడియోలతో సెటైర్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 26 , 2025 | 05:43 PM