Share News

KCR B form to Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్

ABN , Publish Date - Oct 14 , 2025 | 06:53 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఫాం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40 లక్షల చెక్కును అందజేశారు గులాబీ బాస్.

KCR B form to Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్
KCR Bform to Maganti Sunitha

హైదరాబాద్, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Eelection) బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha)కు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఇవాళ(మంగళవారం) బీఫాం అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40లక్షల చెక్కును అందజేశారు గులాబీ బాస్. ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో మాగంటి సునీత కుటుంబ సభ్యులతో వెళ్లి కలిశారు.

kcr.jpg


అనంతరం గులాబీ బాస్‌తో పలు కీలక అంశాలపై చర్చించారు మాగంటి సునీత. ఈ సందర్భంగా సునీత గెలవాలని ఆకాంక్షించారు కేసీఆర్. అయితే, రేపు(బుధవారం) సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయనున్నారు మాగంటి సునీత. ఈనెల 19వ తేదీన భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ వేయనున్నారు మాగంటి సునీత.


కాగా, ఇప్పటికే మాగంటి సునీతకి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్‌రావు (HarishRao) ప్రచారం చేస్తున్నారు. కాగా, 2023 ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. అనారోగ్య కారణాలతో గోపీనాథ్ మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో గోపీనాథ్ భార్య మాగంటి సునీతకి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు కోసం గులాబీ శ్రేణులు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రుల మధ్య విభేదాలు.. స్పందించిన మంత్రి ఉత్తమ్

సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. బీఆర్ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 08:03 PM