Share News

Nizamabad Terrorist Arrest: బోధన్‌లో ఉగ్ర కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు

ABN , Publish Date - Sep 10 , 2025 | 07:56 PM

డ్యానిష్‌కు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్‌‌‌లోని రాంచిలో బాంబు బ్లాస్టింగ్‌‌కు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు.

Nizamabad Terrorist Arrest: బోధన్‌లో ఉగ్ర కలకలం.. వెలుగులోకి సంచలన విషయాలు

నిజామాబాద్‌: బోధన్‌లో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. పట్టణంలో ఉగ్రవాది ఉంటున్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు దాడి చేసిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాది పట్టణంలోని అనీసనగర్‌‌కు చెందిన డ్యానిష్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతడి నుంచి ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డ్యానిష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సమయంలో కీలక విషయాలు బయటపడ్డాయని పోలీసులు వెల్లడించారు.


డ్యానిష్‌కు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్‌‌‌లోని రాంచిలో బాంబు బ్లాస్టింగ్‌‌కు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు బోధన్‌‌లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించామని చెప్పారు. మరింత సమాచారం కోసం అతడిని విచారించాల్సి ఉందని ఢిల్లీ నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అయితే.. బోధన్‌లో డ్యానిష్ ఒక్కడే ఉన్నడా..? డ్యానిష్ ఒక్కడే ఉంటే తనకి చేతికి తుపాకీ ఎలా వచ్చింది...? ఝార్ఖండ్‌‌‌లాగానే.. తెలంగాణలో కూడా ఏమైనా బాంబు బ్లాస్టింగ్‌ ప్లాన్ చేశాడా..? రాష్ట్రంలో డ్యానిష్ లాంటి ఉగ్రవాదులు ఇంకా ఉన్నారా..? అనే సందేహాలు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పూర్వ జన్మ సుకృతం.. అందుకే..

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..

Updated Date - Sep 10 , 2025 | 08:32 PM