iBomma Ravi: ఐ బొమ్మ రవికి మరోసారి పోలీస్ కస్టడీ.. కీలక అంశాలపై ఫోకస్
ABN , Publish Date - Dec 18 , 2025 | 09:02 AM
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని మరోసారి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు.
హైదరాబాద్, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని (iBomma Ravi) మరోసారి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు (Hyderabad Cyber Crime Police) కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాలుగు కేసుల్లో 12 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఈరోజు(గురువారం) నుంచి రవిని విచారించనున్నారు పోలీసులు. ఒక్కో కేసులో మూడు రోజుల పాటు విచారించాలని నాంపల్లి కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో చంచల్‌గూడా జైల్లో ఉన్న రవిని ఈరోజు 10 గంటలకు కస్టడీలోకి తీసుకొనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రవిని ఇప్పటికే 8 రోజులపాటు రెండుసార్లు కస్టడీలో విచారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ ఎమ్మెల్యేలకు, టీ న్యూస్‌కు కవిత నోటీసులు
హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..
Read Latest Telangana News and National News