Bharat Nagar Case: 14 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Dec 29 , 2025 | 06:28 PM
సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో 2011లో చోటుచేసుకున్న దారుణ హత్యకేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు కరణ్ సింగ్ (అలియాస్ కమ్మ సింగ్)కి మరణశిక్ష విధించింది.
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో (Bharat Nagar) 2011లో చోటుచేసుకున్న దారుణ హత్యకేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు కరణ్ సింగ్ (అలియాస్ కమ్మ సింగ్)కి మరణశిక్ష విధించింది. మూడో అదనపు డిస్ట్రిక్ట్ జడ్జ్ మండా వెంకటేశ్వరరావు ఈ కేసులో తుది తీర్పు ఇచ్చారు.
మహిళను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్రమ సంబంధం కారణంగా హత్య జరిగినట్లు విచారణలో తేలింది. అప్పటి సనత్‌నగర్ పోలీస్ కానిస్టేబుల్ కప్పరి రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తు సమయంలో పటిష్టమైన ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలైంది. నిందితుడికి మరణ శిక్ష విధించడంతో 14 ఏళ్ల తర్వాత బాధితురాలికి న్యాయం జరిగిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ సీపీ అవినాశ్ మొహంతి ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ తీర్పుతో మహిళలపై జరిగే హింస ఘటనలపై చట్టపరమైన దృఢమైన సందేశమని పోలీసులు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ఫైర్
మాధవీలతకు బిగ్ షాక్.. కేసు నమోదు
Read Latest Telangana News And Telugu News