MLA Harish Rao: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 05 , 2025 | 09:18 PM
ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చకు సిద్ధమని హరీష్ రావు సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహించమంటే సీఎం రేవంత్ రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే.. రేవంత్ రెడ్డి కుర్చీ నుంచి దిగిపోడని పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వివరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రికార్డ్ మెజారిటీతో గెలవనున్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చకు సిద్ధమని హరీష్ రావు సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహించమంటే సీఎం రేవంత్ రెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నిర్వహిస్తే.. రేవంత్ రెడ్డిని గల్లా పట్టుకుని నిలదీస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్. మందిని ముంచి రేవంత్ రెడ్డి వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓటుకు వేల రూపాయలు ఇవ్వబోతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంత ఇచ్చినా తీసుకుని.. ఓటు మాత్రం బీఆర్ఎస్‌కు వేయాలని హరీష్ రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు