Gone Prakash Rao: ఆ ఆస్తులు ప్రైవేటు హస్తాల్లో.. గోనె ప్రకాష్ రావు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 09 , 2025 | 02:08 PM
తెలంగాణలో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తెలిపారు. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య ఇతరులకు ఈ విషయం గురించి చెప్పానని.. వారు పట్టించుకోలేదని .గోనె ప్రకాష్ రావు గుర్తుచేశారు.
ఢిల్లీ, ఆగస్టు9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) తెలిపారు. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య ఇతరులకు ఈ విషయం గురించి చెప్పానని.. వారు పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఢిల్లీ వేదికగా ఇవాళ(శనివారం) మీడియాతో గోనె ప్రకాష్ రావు మాట్లాడారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఈ విషయం గురించి చెప్పానని.. దీనిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ను తాను కోరానని.. వారిని కలిసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఏఐసీసీ పెద్దలకు కలిసి తన వద్ద ఉన్న వివరాలు అందిస్తానని స్పష్టం చేశారు గోనె ప్రకాష్ రావు.
తెలంగాణలో ఆరు రాజ కుటుంబాల ఆస్తులు, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ఆస్తులు ప్రైవేట్ వారి చేతుల్లో ఉన్నాయని గోనె ప్రకాష్ రావు గుర్తుచేశారు. బ్రిటిష్ చట్టం కాబట్టి దీనిపై ఎవరు ఏమి చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ల్యాండ్ క్రూజర్ కార్లు, ఇన్నోవా కార్లపై మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టి ఉందని వెల్లడించారు. రేపు ప్రతి మంత్రి హెలికాప్టర్‌లో తిరగాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాలని తాను చూస్తున్నానని తెలిపారు గోనె ప్రకాష్ రావు.
రెండు రోజుల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలుస్తానని.. ఆ ఆస్తులను కాపాడాలని కోరుతానని గోనె ప్రకాష్ రావు చెప్పుకొచ్చారు. గతంలో ఈ విషయంపై జానారెడ్డి అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తయిన తర్వాత కేంద్రంలో కూడా కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల అంశాన్ని బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఆ ఆదాయాన్ని సమకూర్చుకుంటే రెండు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రజాహితం కోసం తన వంతుగా ఈ విషయంపై ప్రయత్నం చేస్తున్నానని గోనె ప్రకాష్ రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సృష్టి కేసులో వైసీపీ నేత సోదరుడు పాత్రపై అనుమానాలు
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు
Read latest Telangana News And Telugu News