GHMC: జీహెచ్ఎంసీ మరో సంచలన నిర్ణయం.. ఆ అధికారి సస్పెండ్
ABN , Publish Date - Dec 28 , 2025 | 08:56 PM
జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సస్పెండ్ చేశారు. బదిలీల్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డిని అల్వాల్ సర్కిల్ నుంచి కవాడిగూడకు ట్రాన్స్‌ఫర్ చేశారు.
హైదరాబాద్, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీ (GHMC) మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సస్పెండ్ చేశారు. బదిలీల్లో భాగంగా శ్రీనివాస్ రెడ్డిని అల్వాల్ సర్కిల్ నుంచి కవాడిగూడకు ట్రాన్స్‌ఫర్ చేశారు. బదిలీ ఉత్తర్వులను డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి లెక్కచేయకుండా విధుల్లో చేరకపోవడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. కమిషనర్ ఆదేశాలను లెక్కచేయని చర్యగా గుర్తించి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేశారు.
గతంలో అల్వాల్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమయంలో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు కేటాయించినట్లు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డిపై విజిలెన్స్ విచారణ చేయించారు కమిషనర్ ఆర్వీ కర్ణన్. ఈ విచారణలో అక్రమంగా ఖాళీ స్థలానికి ఆయన ఇంటి నెంబర్లు కేటాయించినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అల్వాల్ నుంచి కవాడిగూడకి ట్రాన్స్‌ఫర్ చేసినా పట్టించుకోకుండా.. తిరిగి అల్వాల్‌లోనే పోస్టింగ్ తెచ్చుకుంటానని కవాడిగూడలో జాయిన్ అవ్వలేదు శ్రీనివాస్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆయనను సస్పెండ్ చేశారు కమిషనర్ ఆర్వీ కర్ణన్.
ఈ వార్తలు కూడా చదవండి...
జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం.. అధికారుల బదిలీలు
నేను ఆంధ్రాలో చదివితే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంటీ.. కేటీఆర్ ప్రశ్నల వర్షం
Read Latest Telangana News And Telugu News