Share News

GHMC Worker Death in Ganesh immersion Duties: వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:29 AM

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.

GHMC Worker Death in Ganesh immersion Duties: వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..
GHMC Worker Death in Ganesh immersion Duties

హైదరాబాద్, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): వినాయక నిమజ్జన విధుల్లో (Ganesh immersion Duties) అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక. ఇవాళ(ఆదివారం) ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు రేణుక.


ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించారు మృతురాలు. అదే సమయంలో రేణుకను బలంగా ఢీ కొట్టింది బషీర్ బాగ్ నుంచి వస్తున్న వినాయకుడు ఉన్న టస్కర్ వాహనం. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేణుక మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు.


టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ గజానంద్‌‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రేణుక మృతి పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్: మంత్రి తుమ్మల

For More TG News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 11:42 AM