Share News

Hyderabad House Numbers Scam: భాగ్యనగరంలో బయటపడ్డ మరో భారీ స్కాం.. సంచలన విషయాలు వెలుగులోకి..

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:32 PM

భాగ్యనగరంలో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించి మోసానికి పాల్పడ్డాడు అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. అధికారులకి అనుమానం వచ్చి కూపీలాగితే ఆయన డొంక కదిలింది.

Hyderabad House Numbers Scam: భాగ్యనగరంలో బయటపడ్డ మరో భారీ స్కాం.. సంచలన విషయాలు వెలుగులోకి..
Hyderabad House Numbers Scam

హైదరాబాద్, అక్టోబరు11(ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు (House Numbers) కేటాయించి మోసానికి పాల్పడ్డాడు అల్వాల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి (Alwal Deputy Commissioner Srinivas Reddy). అధికారులకి అనుమానం వచ్చి కూపీలాగితే ఆయన డొంక కదిలింది.

GHMC.jpg


ఈ మేరకు డీసీ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలకు సిద్ధమయ్యారు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ (GHMC Commissioner Karnan). విజిలెన్స్ విచారణ చేయించి రిపోర్ట్ తెప్పించుకున్నారు కమిషనర్. డీసీ శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా ఇంటి నెంబర్లు కేటాయించినట్లు విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. కోర్టు వివాదాల్లో ఉన్న భూమికి సెల్ఫ్ అసెస్‌మెంట్ ద్వారా 10 పెద్ద బిల్డింగ్స్ ఉన్నట్లు ఇంటి నంబర్స్ కేటాయించారు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి.


అల్వాల్‌లోని 573, 574 సర్వే నంబర్స్‌లో ఖాళీ స్థలానికి ఇంటి నంబర్స్ కేటాయించి ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్స్‌ని కేటాయించారు అల్వాల్ డీసీ శ్రీనివాస్ రెడ్డి. ఇంటి నెంబర్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్కెచ్ వేశారు. ఫేక్ ఇంటి నెంబర్లతో కేటాయించిన ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్స్‌ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ రద్దు చేశారు . ఈ క్రమంలో అల్వాల్ డీసీ శ్రీనివాస్ రెడ్డిపై జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, స్టేట్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విచారణలో అల్వాల్ డిప్యూటీ కమిషనర్ వ్యవహారం బయటపడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతిలో.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ

నార్సింగి డ్రగ్స్ కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2025 | 01:46 PM