Actor Nagarjuna: ఫ్యూచర్ సిటీ ఆలోచన బాగుంది.. నాగార్జున కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:54 PM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సినీనటుడు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీలో మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ ప్రముఖులు కలిసి ముందుకు రావడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) ఇవాళ (సోమవారం) నుంచి రెండు రోజులపాటు అత్యంత వైభవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తోంది. అయితే, గ్లోబల్ సమ్మిట్‌లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అక్కినేని నాగార్జున (Actor Nagarjuna) సమ్మిట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఒకే కారులో అక్కడికి వచ్చారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు భట్టి విక్రమార్క, నాగార్జున.
అనంతరం మీడియాతో నాగార్జున మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నామని.. ఇక్కడ వాతావరణం బాగుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అన్నపూర్ణ స్టూడియో ఉందని.. ఫ్యూచర్ సిటీలో మరో స్టూడియో నిర్మాణానికి బాలీవుడ్ ప్రముఖులు కలిసి ముందుకు రావడం మంచి పరిణామమని చెప్పుకొచ్చారు. అందరూ కలిసి వస్తే ప్రపంచ వ్యాప్త ఫెసిలిటీస్‌తో పెద్ద నిర్మాణం చేయవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ఫ్యూచర్ సిటీ ఆలోచన బాగుందని నటుడు నాగార్జున ప్రశంసించారు.
కాగా, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం1:30లకు ఈ సదస్సును ప్రారంభించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మధ్యాహ్నం 2:30కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. సమ్మిట్ వేదిక దగ్గర స్టాళ్లను పరిశీలించారు సీఎం. ఈ సదస్సులో నోబెల్ గ్రహీతలు బెనర్జీ, కైలాశ్ ప్రసంగాలు ఉండనున్నాయి. ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ సదస్సు జరగుతోంది. వివిధ రంగాల ప్రతినిధుల బృందాలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహం ఆవిష్కరించారు. సీఎం వెంట మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఈ సదస్సుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, నటుడు నాగార్జున హాజరయ్యారు. ఈ సమ్మిట్‌లో వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు జరగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..!
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
For More TG News And Telugu News