Loan Scam in Hyderabad: భాగ్యనగరంలో మరో బడా మోసం.. .. రుణం పేరిట కుచ్చుటోపీ
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:56 PM
సైబర్ మోసాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న ప్రజలు మోసపోతునే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసగించారు.
హైదరాబాద్, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): సైబర్ మోసాల (Cyber Fraud)పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా అవగాహన కల్పిస్తున్న ప్రజలు మోసపోతునే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసగించారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ( మంగళవారం) వెల్లడించారు. హైదరాబాద్‌లో ఫేక్ ఎన్జీవో లోన్ స్కామ్ (Fake NGO Loan Scam) వెలుగులోకి వచ్చింది.
ఈ స్కాంలో రూ.7.9 లక్షలు బేగంపేటకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి మోసపోయాడు. వాట్సాప్ కాల్‌లో HYC ఫౌండర్ సల్మాన్ ఖాన్ డీపీతో ఓ వ్యక్తి రూ.50 లక్షల లోన్ హామీ ఇచ్చాడు. మొదటగా రూ.10 లక్షలు కట్టాలని అడిగాడు. ఆ తర్వాత లోనుకి కావాల్సిన పైసలు ఇస్తానని నమ్మబలికాడు. ఇది నిజమనుకున్న బాధితుడు రూ.7.9లక్షలు కట్టాడు. ఆ తర్వాత బాధితుడిని నేరగాళ్లు మోసం చేశారు. చివరికి మోసపోయినట్లు గ్రహించి బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అపరిచిత NGO/వ్యక్తుల లోన్ ఆఫర్లను నమ్మవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. ముందస్తు ఫీజులు, టాక్స్‌లు కట్టవద్దని తెలిపారు. సెలబ్రిటీ డీపీలు లేదా అనుమానాస్పద అకౌంట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ధ్రువీకరించిన రిజిస్టర్ సంస్థల ద్వారా మాత్రమే లోన్ అభ్యర్థించాలని సూచించారు. సైబర్ క్రైమ్ మోసం జరిగితే డయల్ - 1930 ద్వారా లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రుల మధ్య విభేదాలు.. స్పందించిన మంత్రి ఉత్తమ్
సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. బీఆర్ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఫైర్
Read Latest Telangana News And Telugu News