TG NEWS: చైతన్యపురి మెట్రో రైలు స్టేషన్‌కు నోటీసులు.. అసలు కారణమిదే..
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:35 PM
చైతన్యపురి మెట్రో రైలు స్టేషన్‌కు విద్యుత్ సంస్థ నోటీసులు జారీ చేసింది.రూ. 31,829 బకాయి ఉన్నట్లు విద్యుత్ సంస్థ పేర్కొంది. 2015 జులై 23వ తేదీన మెట్రో పనుల కోసం మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేటు విద్యుత్తు కనెక్షన్ తీసుకుంది.
హైదరాబాద్, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): చైతన్యపురి మెట్రో రైలు స్టేషన్‌కు తెలంగాణ విద్యుత్ సంస్థ నోటీసులు జారీ చేసింది. రూ. 31,829 బకాయి ఉన్నట్లు విద్యుత్ సంస్థ పేర్కొంది. 2015 జులై 23వ తేదీన మెట్రో పనుల కోసం విద్యుత్తు కనెక్షన్‌ను మెస్సర్స్ థేల్స్ ఇండియా ప్రైవేటు ఏజెన్సీ తీసుకుంది. ఆ తర్వాత ఆ ఏజెన్సీ వెళ్లిపోయింది. 2021 డిసెంబరు నాటికి బకాయి పడిన వినియోగదారుల నుంచి వసూలుకు టీజీ ఎస్పీడీసీఎల్ చర్యలు చేపట్టింది. మెట్రో కోసం పని చేసిన ఈ ఏజెన్సీ మెస్సర్స్ థేల్స్ చిరునామా, నంబరును గుర్తించడానికి జప్తు నోటీసును విద్యుత్ సంస్థ అధికారులు చైతన్యపురి మెట్రో రైలు స్టేషన్‌లో అంటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
కంచ గచ్చిబౌలి.. పర్యావరణ పరిరక్షణలో మంచి ఫలితాలుంటే అభినందిస్తాం.. సీజేఐ ప్రశంసలు
Read latest Telangana News And Telugu News