DGP Jitender Alert on Heavy Rains: భారీ వర్షాలతో వేగంగా సహాయక చర్యలు
ABN , Publish Date - Aug 28 , 2025 | 03:18 PM
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. సహాయక చర్యలు వేగంగా చేపడుతున్నామని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) అప్రమత్తంగా ఉన్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ (DGP Jitender) పేర్కొన్నారు. భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న వారిలో ఇప్పటివరకు రెండు వేల మందిని రెస్క్యూ చేశామని తెలిపారు. ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ సహాయంతో రెండు హెలికాఫ్టర్ల ద్వారా రెస్క్యూ చేశామని వెల్లడించారు. రెండు వేల మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్‌ను(SDRF) ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని చెప్పుకొచ్చారు, ఎన్డీఆర్ఎఫ్‌కు(NDRF) దీటుగా ఎస్డీఆర్ఎఫ్(SDRF) టీమ్స్ పని చేస్తున్నాయని ఉద్ఘాటించారు డీజీపీ జితేందర్.
తెలంగాణలో ఎన్డీఆర్ఎఫ్‌తో(NDRF)పాటు ఎస్డీఆర్ఎఫ్(SDRF) కూడా రెస్క్యూ చేస్తోందని తెలిపారు. ఇవాళ(గురువారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో డీజీపీ జితేందర్ మాట్లాడారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. ఎక్కడ కూడా ప్రజల ప్రాణాలు పోకుండా రెస్క్యూ చేస్తున్నామని వెల్లడించారు. గత ఏడాది నుంచి ఎస్డీఆర్ఎఫ్(SDRF) మంచి ఫలితాలను ఇస్తోందని తెలిపారు. అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిస్తూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒకవైపు వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ వరదలపై పోలీస్ శాఖ వేగంగా సహాయక చర్యలు చేపడుతోందని తెలిపారు డీజీపీ జితేందర్.
హైదరాబాద్‌లో రాత్రి పూటమే వర్షం కురుస్తోండటంతో ఇబ్బంది లేదని వెల్లడించారు. నగరంలో భారీ వర్షాలు, వరద వచ్చిన వాటిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. డీజీపీ కార్యాలయంలో సహాయక టీమ్స్‌ను సిద్ధం చేశామని తెలిపారు. కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులు ధ్వంసం అయ్యాయని చెప్పుకొచ్చారు. ఒక రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా ధ్వంసమైందని.. వాటిని పునరుద్ధరించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం
తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్
Read Latest Telangana News and National News