Share News

MP Mallu Ravi: హైకోర్టు స్టే ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టినట్టు గుర్తించాల్సిందే..

ABN , Publish Date - Oct 09 , 2025 | 07:58 PM

చట్టం ప్రకారం బీసీ రిజర్వేషన్ చేశామని మల్లు రవి తెలిపారు. అసెంబ్లీలో కూడా పెట్టామని, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారని రిపోర్ట్ వచ్చిందని వివరించారు.

MP Mallu Ravi: హైకోర్టు స్టే ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టినట్టు గుర్తించాల్సిందే..
Mallu Ravi

ఢిల్లీ: ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుగాని, హైకోర్టుగాని స్టే ఇచ్చిన దాఖలాలు లేవని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రపతి, గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలపకపోతే.. ఆమోదం పొందినట్టుగా భావించాల్సి ఉంటుందని చెప్పిందని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్లు ఇవ్వడంతో చాలామంది నామినేషన్లు వేశారని పేర్కొన్నారు. ఎన్నికలు పెట్టకపోవడంతో పంచాయతీకి రావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదని స్పష్టం చేశారు.


చట్టం ప్రకారం బీసీ రిజర్వేషన్లు చేశామని మల్లు రవి తెలిపారు. అసెంబ్లీలో పెట్టామని, అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయని పేర్కొన్నారు. బీసీలు 56 శాతం ఉన్నారని రిపోర్ట్ వచ్చిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం 10% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిందని చెప్పారు. 50% సీలింగ్ అప్పుడే దాటిందని అన్నారు. హైకోర్టు స్టే ఇవ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కన పెట్టినట్టు గుర్తించాల్సిందే అని వెల్లడించారు. రిజర్వేషన్లపై జడ్జిమెంట్ రావడం అంటే ప్రజాస్వామ్యం గురించి చాలా లోతుగా అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చ జరగాలని ఆయన సూచించారు.


న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నామని ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించే వ్యవస్థ న్యాయవ్యవస్థ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాస్త్రీయంగా తెలంగాణలో కులగణన చేశారని తెలిపారు. బీసీ కులగణన ప్రతి కుటుంబ ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితులు తెలుసుకున్నారని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు దానికి అడ్డుకట్ట వేసినటైందని అసహనం వ్యక్తం చేశారు. న్యాయ నిపుణులతో చర్చించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన ఆలోచన చేస్తామని ఆయన వివరించారు. రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పకూలిన పోలీస్ అధికారి.. అసలేమైందంటే..

రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..

Updated Date - Oct 09 , 2025 | 09:04 PM