Share News

Addanki Dayakar: తెలంగాణ మీ జాగీరా.. కేటీఆర్‌‌పై అద్దంకి దయాకర్ సెటైర్లు

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:43 PM

తెలంగాణ ప్రజలను మోసం చేసిన దొంగలు కేసీఆర్ కుటుబం సభ్యులని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పేరు పెట్టుకున్నాక తెలంగాణతో మీకు సంబంధం ఏంటని అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.

Addanki Dayakar: తెలంగాణ మీ జాగీరా.. కేటీఆర్‌‌పై అద్దంకి దయాకర్ సెటైర్లు
Congress MLC Addanki Dayakar

హైదరాబాద్: మాజీమంత్రి కేటీఆర్‌వి (KTR) చిల్లర ప్రయత్నాలు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) విమర్శించారు. ఇవాళ(మంగళవారం) ఏబీఎన్‌తో అద్దంకి దయాకర్ మాట్లాడారు. కేటీఆర్‌ని చూస్తే జాలి వేస్తోందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ చర్చించడానికి అసెంబ్లీ ఉందని గుర్తుచేశారు. కేసీఆర్ కంటే రేవంత్‌రెడ్డిది పెద్ద స్థాయి అని ఉద్ఘాటించారు. కేటీఆర్‌కి దమ్ముంటే కేసీఆర్‌ని అసెంబ్లీకి తీసుకురావాలని సవాల్ విసిరారు. తమకి అనుకూలంగా రాస్తే అందరి మీడియా, వ్యతిరేకంగా రాస్తే ఆంధ్రా మీడియానా అని ప్రశ్నించారు. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఉద్యమానికి ఏం చేసిందో కేసీఆర్‌ని అడిగితే తెలుస్తోందని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.


తెలంగాణ మీ జాగీరా..

‘తెలంగాణ మీ జాగీరా?. సాగరహారం జరుగుతుంటే ఎక్కడ ఉన్నారు. సాగరహారం జరిగిన రోజుల్లో మీ మొహాలు ఎక్కడున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లం మేము. సారా అమ్ముతారు జై తెలంగాణ అంటారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తారు.. జై తెలంగాణ అంటారు. బీఆర్ఎస్ పేరు పెట్టుకున్నాక తెలంగాణతో మీకు సంబంధం ఏంటి?. నీ చెల్లి కవిత ఫోన్‌ని ట్యాపింగ్ చేసి అణగదొక్కావ్. మీ చెల్లి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా?. తెలంగాణ ప్రజలను మోసం చేసిన దొంగలు మీరు. రేవంత్‌రెడ్డితో పోలిక పెట్టుకోవడానికి అర్హతే లేదు మీకు. నమ్మించి మోసం చేయడమే మీ అయ్య సంస్కృతి. ఆంధ్రా తెలంగాణ అంటూ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. వాళ్లకి అనుకూలంగా ఉంటే మంచి మీడియానా? లేకపోతే చెడ్డ మీడియానా?. బీఆర్ఎస్ పార్టీని మీ నలుగురు తప్ప.. ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. కేసీఆర్‌కి రావడం చేతకాక బచ్చగాడిని పంపుతారా. మాకు సానుభూతి ఉంది కాబట్టే హాస్పిటల్‌కి వెళ్లి కేసీఆర్‌ని పరామర్శిస్తున్నాం. బావ, బామ్మర్ధులతో పాటు చెల్లి ఇప్పుడు పోటీలోకి వచ్చింది. అందరూ కలిసినా రేవంత్‌ని ఏం చేయలేకపోయారు. పిచ్చిమాటలు మాట్లాడితే మా తడాఖా చూపిస్తాం. మొన్నటి ఎన్నికల్లో కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వచ్చేవి’ అని అద్దంకి దయాకర్ ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 08 , 2025 | 01:41 PM