Share News

TG NEWS: ఫిల్మ్ నగర్‌లో భూ ఆక్రమణలు.. కలెక్టర్‌కు ఫిర్యాదు

ABN , Publish Date - May 02 , 2025 | 12:51 PM

Film Naga Land Encroachment: కొంతమంది అక్రమార్కులు ఫిల్మ్ నగర్‌ భూమిని ఆక్రమించారని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు.

TG NEWS: ఫిల్మ్ నగర్‌లో భూ ఆక్రమణలు.. కలెక్టర్‌కు ఫిర్యాదు
Film Naga Land Encroachment

హైదరాబాద్: షేక్‌పేట్ మండలం ఫిల్మ్‌నగర్‌లో భూ ఆక్రమణలపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఇవాళ(శుక్రవారం) ఫిర్యాదు అందింది. దీన్ దయాళ్ నగర్‌లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కలెక్టర్‌ అనుదీప్ దురిశెట్టికి ఫిర్యాదు చేశారు. పలుమార్లు అధికారులను కంపౌండ్ వాల్ నిర్మాణం కోసం కోరినప్పటికీ స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని చింతల రామచంద్రారెడ్డి కోరారు. సంబంధిత అధికారులు వెంటనే స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఆక్రమణలు నివారించేందుకు జీహెచ్ఎంసీ ల్యాండ్స్ బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ అనుదీప్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


ఇళ్ల నిర్మాణంపై చర్చ:

రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ నియోజకవర్గానికి 4,000 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించిందని చింతల రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. హౌసింగ్ ప్రాజెక్టులపై ప్రణాళిక ఏమైనా రూపొందించారా అని కలెక్టర్‌ అనుదీప్‌ను చింతల రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. రూరల్ ఏరియాల్లో స్థలం ఉన్న వారు ఉంటే వారికి రూ. 5 లక్షల చొప్పున ఇళ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ మంజూరవుతుందని కలెక్టర్ తెలిపారు. అర్బన్ ఏరియాల్లో స్థలం కలిగినవారు తక్కువగా ఉన్నందున ప్రత్యేక మోడిఫైడ్ హౌసింగ్ స్కీమ్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి 3,500 ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..

Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

Gold Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 06 , 2025 | 07:29 AM