Share News

CM Revanth Reddy: మేడారంలో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:42 PM

మేడారం ఆలయ విస్తరణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలోని చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని సీఎం తెలిపారు.

CM Revanth Reddy: మేడారంలో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు..
CM Revanth Reddy

ములుగు: మేడారంలో సమ్మక్క, సారలమ్మ ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆలయ విస్తరణ, మాస్టర్ ప్లాన్‌పై రేవంత్ రెడ్డి చర్చించారు. 2026 మహాజాతరకు ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.


మేడారం ఆలయ విస్తరణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలోని చెట్లను సంరక్షించుకుంటునే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని సీఎం తెలిపారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అనంతరం సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణం విస్తరణ, పునఃనిర్మాణం చేయనున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ మేరకు అమ్మవార్లకు సీఎం రేవంత్ రెడ్డి 68 కేజీల బంగారం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 23 , 2025 | 01:48 PM