CM Revanth Met Gadkari: నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక భేటీ
ABN , Publish Date - Sep 09 , 2025 | 09:28 PM
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం పర్యటించారు. ఈ క్రమంలో జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ (మంగళవారం) పర్యటించారు. ఈ క్రమంలో జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. రీజినల్ రింగు రోడ్డు(నార్త్ పార్ట్)కు సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి కేంద్ర ఆర్థిక, కేబినెట్ అనుమతులు ఇప్పించాలని విన్నవించారు సీఎం రేవంత్‌రెడ్డి.
జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ (MORTH) నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇప్పించాలని కోరారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ( Telangana Govt) సమర్పించిన డీపీఆర్‌కు అనగుణంగా రీజినల్ రింగు రోడ్డు (సౌత్ పార్ట్)కు అనుమతులు ఇప్పించేలా కృషి చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు రావిర్యాల - ఆమన్‌గల్ - మన్ననూర్ రహదారిని నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా నిర్మించాలని సూచించారు.
అలాగే మన్ననూర్ - శ్రీశైలం (ఎన్‌హెచ్ 765) నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతించాలని కేంద్ర మంత్రి గడ్కరీని (Nitin Gadkari) సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ - మంచిర్యాల మధ్య నూతన గ్రీన్‌ఫీల్డ్ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు చేయాలని విన్నవించారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకూ 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారికి అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ వార్తలు కూడా చదవండి..
దసరా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు
For More Telangana News and Telugu News..