CM Revanth on Medaram: మేడారం అభివృద్ధిపై దిశానిర్దేశం.. అధికారులకు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 20 , 2025 | 09:57 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన మేడారంలో పర్యటించనున్నారు. మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేయనున్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఈ నెల 23వ తేదీన మేడారం (Medaram)లో పర్యటించనున్నారు. మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి పలు సూచనలు చేయనున్నారు. అక్కడే అభివృద్ధిపై సమీక్షించి డిజైన్లను ఖరారు చేయనున్నారు. అయితే, మేడారం అభివృద్ధిపై ఇవాళ (శనివారం) కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడారం అభివృద్ధి ప్రణాళికపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 23వ తేదీన మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి సమ్మక్క సారలమ్మ పూజారులను సంప్రదించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
పూజారుల సూచనల మేరకు వారి ఆమోదంతో మేడారం అభివృద్ధి (Medaram Development)పై డిజైన్లను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి. మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని ఆశిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ క్రమంలోనే గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 23వ తేదీన సీఎంతో పాటు మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు మేడారం వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News