CM Chandrababu Naidu: టీటీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై దిశానిర్దేశం
ABN , Publish Date - Oct 07 , 2025 | 10:03 PM
తెలుగుదేశం తెలంగాణ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు చంద్రబాబు.
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం (Telugu Desam) తెలంగాణ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(మంగళవారం) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీ కమిటీల నియామకంపై చర్చించారు. సుదీర్ఘ కాలం తర్వాత చంద్రబాబుతో తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబుతో సమావేశం అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుని ఎంపిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో ప్రధానంగా మాట్లాడారు. ఇప్పటికే కసరత్తు పూర్తి అయిన నేపథ్యంలో తెలంగాణలో మండల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షునితో పాటు స్టేట్ కమిటీని నియమించాలనే అంశంపైనా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో 1.78 లక్షల సభ్యత్వం చేసినట్లు చంద్రబాబుకు నాయకులు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.... గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు టీడీపీలో యాక్టివ్‌గా పనిచేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు నాయకులు. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం గురించి నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నారు చంద్రబాబు. కమిటీల నియామకం పూర్తి చేసుకుని పార్టీ యాక్టివిటీ పెంచాలని దిశానిర్దేశం చేశారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చేవారికి టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విడిచి పెట్టం.. పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్
జగన్.. ఎన్ని జన్మలెత్తినా పాపాలను కడుక్కోలేరు.. సోమిరెడ్డి సెటైర్లు
Read Latest AP News And Telugu News