Share News

BRS Protest: ఛలో బస్ భవన్‌కు బీఆర్ఎస్ పిలుపు.. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:51 PM

ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు పెంచింది.

BRS Protest: ఛలో బస్ భవన్‌కు బీఆర్ఎస్ పిలుపు.. ఛార్జీలు తగ్గించాలని డిమాండ్
BRS Protest

హైదరాబాద్: ఛలో బస్ భవన్‌కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రేపు(గురువారం) బస్ భవన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టనున్నారు. సిటీలో ఆర్టీసీ ఛార్జీల పెంపును ఖండిస్తూ.. బీఆర్ఎస్ ఆందోళనకు దిగనుంది. ఈ నేపథ్యంలో మెహిదీపట్నం నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర నేతలు ప్రయాణం చేయనున్నారు. బస్ భవన్‌కు చేరుకుని ఆర్టీసీ ఎండీకి‌ ఛార్జీల పెంపుపై మెమోరాండం ఇవ్వనున్నారు. ఈ మేరకు బస్ భవన్ ముందు ధర్నా చేపట్టి సిటీ బస్సుల్లో పెంచిన ఛార్జీలు తగ్గించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది.


కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు పెంచింది. ఈ మేరకు మొదటి మూడు స్టేజిలకు రూ.5, 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీ ఛలో బస్ భవన్‌‌కు పిలుపునిచ్చింది.


Also Read:

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్..

మాజీ సీఎం జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఫైర్..

అభ్యర్థుల ఖరారుకు బీజేపీ కీలస సమావేశం

Updated Date - Oct 08 , 2025 | 06:41 PM