Share News

Harish Rao: రేవంత్ ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసింది: హరీష్‌రావు

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:22 PM

నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టుకి వెళ్లడం అంటే సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు అన్నట్లేనని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. రేవంత్ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ స్పష్టత లేదని హరీష్‌రావు చెప్పారు.

Harish Rao: రేవంత్ ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసింది: హరీష్‌రావు
BRS MLA Harish Rao

హైదరాబాద్: రేవంత్ ప్రభుత్వం (Revanth Government) వైద్యరంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA Harish Rao) విమర్శలు చేశారు. వైద్య కళాశాలల్లో కనీస వసతులు లేవని ఎన్ఎంసీ లేఖ రాసిందని గుర్తుచేశారు. తెలంగాణలో కనీసం కోవిడ్ కిట్లు లేవని మండిపడ్డారు. దేశంలో 90వేల కరోనా కేసులు ఉంటే.. రాష్ట్రంలో కనీసం కోవిడ్ టెస్ట్‌లు కూడా చేయడం లేదని ధ్వజమెత్తారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు మీడియాతో చిట్‌చాట్ చేశారు.


రేవంత్ ప్రభుత్వానికి ఏ విషయంలోనూ స్పష్టత లేదని మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పారు. రుణమాఫీ, రైతుభరోసా, యువవికాసం... ఇలా అన్ని అంశాల్లోనూ ప్రభుత్వానికి స్పష్టత లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిందేమీ లేదు... కానీ, ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం క్యాంపు కార్యాలయం మాత్రం సిద్ధమైందని చెప్పుకొచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయం కోసం రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారని అన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టుకి వెళ్లడం అంటే సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు అన్నట్లేనని విమర్శించారు మాజీ మంత్రి హరీష్‌రావు.


కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోతే... 30టీఎంల నీళ్లు హైదరాబాద్‌కి ఎక్కడ నుంచి తీసుకువస్తారని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. గోదావరి - బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్, లేఖల ఆధారంగానే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. 90శాతం విషయాలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. రేవంత్ ప్రభుత్వంలో పనిచేసే వారికి ఈ విషయాలు తెలియవు, నేర్చుకోరని ఎద్దేవా చేశారు. గోదావరి - బనకచర్ల గురించి ఇప్పటికే చాలాసార్లు తాను మాట్లాడానని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కూడా లేఖ రాశానని గుర్తుచేశారు. తాను ఉన్న వాస్తవాలు మాట్లాడితే కాంగ్రెస్ నేతలు లీకులు అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 05:30 PM