She Teams: సైబరాబాద్‌లో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్స్.. 70 మంది అరెస్ట్..
ABN , Publish Date - Aug 25 , 2025 | 10:22 AM
బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల ఆగడాల నుంచి రక్షించేందుకు మహిళలు, పిల్లల భద్రత కోసం నిత్యం షీ టీమ్స్ పహారా కాస్తున్నాయి. తాజాగా నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 70 మంది అరెస్టయ్యారు.
సైబరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లల సంరక్షణ కోసం సైబరాబాద్ షీ టీమ్స్ చురుగ్గా పనిచేస్తున్నాయి. బస్టాపులు, రోడ్లు వంటి రద్దీ ప్రదేశాల్లో ఆవారాగాళ్లు, చైన్ స్నాచర్ల ఆగడాలకు కళ్లెం వేసేందుకు నిత్యం మఫ్టీలో సంచరిస్తూ ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇంటా బయటా మహిళలు, చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఆకతాయిల భరతం పడుతున్నాయి. తాజాగా సైబరాబాద్ షీ టీమ్స్ నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో ఏకంగా 70 మంది అరెస్ట్ అయ్యారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సైబరాబాద్‌లో షీ టీమ్స్ ఇటీవల143 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించింది. మహిళలను, చిన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, వేధింపుల గురిచేస్తున్న 70 మంది ఆకతాయిలనురెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మొత్తంగా 47 కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి..
మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తపై భార్య దాడి
నీటిలో విషం కలిపిన టీచర్‌పై హత్యాయత్నం కేసు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.