Domestic Dispute: మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తపై భార్య దాడి
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:09 AM
మద్యం తాగి తరచూ వేధిస్తున్నాడని భర్తపై భార్య దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన పర్వతం గంగరాజుకు లక్ష్మీతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది.
తీవ్ర గాయాలు.. కేసు నమోదు
పెనుబల్లి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మద్యం తాగి తరచూ వేధిస్తున్నాడని భర్తపై భార్య దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన పర్వతం గంగరాజుకు లక్ష్మీతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. గంగరాజు ఇటీవల తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య, పిల్లలతో గొడవ పడుతున్నాడు. దీంతో భార్యభర్తల మధ్య కొంత కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి.
శనివారం మద్యం తాగి ఇంటికి వచ్చిన గంగరాజు.. భార్య లక్ష్మీతో గొడవకు దిగాడు. ఎదురుతిరిగిన లక్ష్మీ.. భర్త గంగరాజు నోట్లో గుడ్డలు కుక్కి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన గంగరాజును పెనుబల్లి ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. లక్ష్మీపై వీఎం బంజర్ పోలీసులు కేసు నమోదు చేశారు.