Share News

Woman Assasination For Mangalsutra: అన్నా చెల్లెళ్ల బంధం.. మంగళ సూత్రం కోసం హత్య..

ABN , Publish Date - Aug 25 , 2025 | 09:05 AM

గత కొన్ని నెలలుగా అతడు ఆటో ఈఎమ్ఐ కట్టడం లేదు. ఆటో తీసుకెళ్లిపోతామని ఫైనాన్ష్ ఇచ్చిన వాళ్లు బెదిరించారు. దీంతో రాకేష్‌కు ఓ క్రూరమైన ఆలోచన వచ్చింది. అర్చన మెడలోని బంగారు మంగళసూత్రం కొట్టేయాలని నిశ్చయించుకున్నాడు.

Woman Assasination For Mangalsutra: అన్నా చెల్లెళ్ల బంధం.. మంగళ సూత్రం కోసం హత్య..
Woman Assasination For Mangalsutra

మానవ సంబంధాలను ప్రశ్నించే సంఘటన ఇది. ఒకే కడుపున పుట్టకపోయినా.. ఆ ఇద్దరి మధ్యా అన్నాచెల్లెళ్ల బంధం ఉంది. ఆ మహిళ అతడ్ని సొంత అన్నలాగా భావించేది. తన కష్టసుఖాలను అతడితో పంచుకునేది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. అన్నలాంటి వాడితో వీడియో కాల్ మాట్లాడటమే ఆమె ప్రాణాలు తీసింది (Chikkaballapur Woman Assasination). సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల మేరకు..


సత్యసాయి జిల్లా హిందూపూర్‌కు చెందిన అర్చనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు చిక్‌బళ్లాపూర్ జిల్లా గౌరిబిద్నూర్‌, విరుపసంద్రకు చెందిన రాకేష్‌తో కొన్నేళ్ల క్రితం పరిచయం అయింది. అతడు హిందూపూర్, గౌరిబిద్నూర్‌లలో పెళ్లిళ్లకు వంటలు చేసేవాడు. అదే సమయంలో అర్చన పెళ్లిళ్లలో సహాయకురాలిగా పనిచేసేది. ఓ పెళ్లిలో ఏర్పడ్డ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ అన్నాచెల్లెళ్లగా కలిసి ఉండేవారు.


కొన్ని నెలల క్రితమే రాకేష్ పెళ్లిళ్లలో వంటలు చేయటం మానేశాడు. బెంగళూరులో ఆటో నడుపుకుని జీవిస్తున్నాడు. అర్చన తరచుగా రాకేష్‌కు వీడియో కాల్స్ చేస్తూ ఉండేది. తన కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉండేది. 20 రోజుల క్రితం కూడా అతడికి వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో అతడు అర్చన మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం చూశాడు( Mangalsutra Robbery). అప్పుల బాధతో అల్లాడుతున్న అతడికి ఓ దుర్భుద్ధి పుట్టింది.


గత కొన్ని నెలలుగా అతడు ఆటో ఈఎమ్ఐ కట్టడం లేదు. ఆటో తీసుకెళ్లిపోతామని ఫైనాన్ష్ ఇచ్చిన వాళ్లు బెదిరించారు. దీంతో రాకేష్‌కు ఓ క్రూరమైన ఆలోచన వచ్చింది. అర్చన మెడలోని బంగారు మంగళసూత్రం కొట్టేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయాన్ని తన ప్రియురాలు అంజలికి చెప్పాడు. అంజలి తన హాస్టల్ రూమ్‌మేట్ నిహారికను తోడు రమ్మంది. ఆ నిహారిక తన స్నేహితుడు నవీన్‌ను తోడు రమ్మంది. ఇలా నలుగురూ ఏకమయ్యారు.


రాకేష్, అర్చనకు ఫోన్ చేసి ఈషా ఫౌండేషన్‌కు రమ్మన్నాడు. ఆగస్టు 14వ తేదీన ఆమె ఈషా ఫౌండేషన్‌కు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లింది. నిందితులు నలుగురు హాస్టల్ ఓనర్ కారులో హిందూపూర్ చేరుకున్నారు. అర్చనను కారులో ఎక్కించుకుని ఆ రోజంతా ఊరు మొత్తం చక్కర్లు కొట్టారు. సాయంత్రం ఆమె గొంతు నులిమి చంపేశారు(Woman Assasination For Mangalsutra). ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగలించారు. శవాన్ని నమ్‌గొండ్లు గ్రామం దగ్గర పడేసి పోయారు.


శవం గురించిన సమాచారం పోలీసులకు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేష్ మీద అనుమానంతో అతడ్ని పిలిచి ఎంక్వైరీ చేశారు. అసలు విషయం బయటపడింది. రాకేష్‌తో పాటు మిగిలిన వాళ్లను కూడా అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

సీఐఎస్ఎఫ్ చరిత్రలో మొదటి సారి.. రంగంలోకి మహిళా కమాండో టీమ్..

యాపిల్ బిగ్ అప్‌డేట్.. యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరిక..

Updated Date - Aug 25 , 2025 | 09:40 AM