Urgent iPhone Security Alert: యాపిల్ బిగ్ అప్‌డేట్.. యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరిక..
ABN , Publish Date - Aug 25 , 2025 | 08:36 AM
యాపిల్ కంపెనీ ఇప్పటికే ఐఓఎస్ 18.6 అప్‌డేట్‌ను ప్రకటించింది. చాలా మంది ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవటం లేదు. పాత ఐఓఎస్ మీదే ఫోన్ రన్ చేస్తున్నారు.
ఐఫోన్ యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ కంపెనీ వస్తువుల్లోని పైథాన్ లైబ్రరీలో లోపం కారణంగా సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉందని తెలిపింది. యాపిల్ కంపెనీ ఇప్పటికే ఐఓఎస్ 18.6 అప్‌డేట్‌ను ప్రకటించింది. చాలా మంది ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లను అప్‌డేట్ చేసుకోవటం లేదు. పాత ఐఓఎస్ మీదే ఫోన్ రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది.
తాజాగా, ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ‘ఇమేజ్ఐఓ కాంపోనెంట్‌లో లోపం ఉంది. బౌండ్స్‌ను సరిగా చెక్ చేయకపోవటం వల్ల ఈ లోపం తలెత్తింది. ఈ లోపాన్ని అదునుగా తీసుకుని రిమేట్ అటాకర్లు సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. యాపిల్ ఫోన్స్, ప్యాడ్స్, మ్యాక్స్ వాడుతున్న వారు వెంటనే తమ వస్తువుల్ని అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే పెద్ద సమస్యల్లో పడతారు’ అని సీఈఆర్‌టీ తెలిపింది.
అప్‌డేట్ చేసుకోవాల్సిన యాపిల్ ఫోన్స్, ప్యాడ్స్, మ్యాక్స్ ..
18.6.2 కంటే తక్కువ వర్షన్‌తో యాపిల్ ఐఓఎస్ అండ్ ఐప్యాడ్ఓఎస్ రన్ చేసుకుంటున్నవారు.
17.7.10 కంటే తక్కువ వర్షన్‌తో యాపిల్ ఐప్యాడ్ఓఎస్ రన్ చేసుకుంటున్నవారు.
15.6.1 కంటే తక్కువ వర్షన్‌తో యాపిల్ఓఎస్ సీక్వోయా వాడుతున్నారు.
14.7.8 కంటే తక్కు వర్షన్‌తో యాపిల్ఓఎస్ సినోమా వాడుతున్నవారు.
13.7.8 కంటే తక్కువ వర్షన్‌తో యాపిల్ఓఎస్ వెంట్యురా వాడుతున్నవారు.
ఇవి కూడా చదవండి
ఎక్కడ తక్కువకు వస్తే అక్కడే ఆయిల్ తీసుకుంటాం.. తేల్చి చెప్పిన వినయ్ కుమార్
సీఐఎస్ఎఫ్ చరిత్రలో మొదటి సారి.. రంగంలోకి మహిళా కమాండో టీమ్..