Share News

Indias Ambassador To Russia: ఎక్కడ తక్కువకు వస్తే అక్కడే ఆయిల్ తీసుకుంటాం.. తేల్చి చెప్పిన వినయ్ కుమార్

ABN , Publish Date - Aug 25 , 2025 | 07:43 AM

రష్యానుంచి భారత్ క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటూ ఉంది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా 50 శాతం టారీఫ్ విధించారు. అయినా కూడా భారత్ వెనక్కు తగ్గలేదు.

Indias Ambassador To Russia: ఎక్కడ తక్కువకు వస్తే అక్కడే ఆయిల్ తీసుకుంటాం.. తేల్చి చెప్పిన వినయ్ కుమార్
Indias Ambassador To Russia

రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యాతో ఆయిల్ ఒప్పందాలు రద్దు చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొన్ని నెలల క్రితమే ట్రంప్ హెచ్చరించారు. భారత్, రష్యానుంచి క్రూడ్ ఆయిల్ కొనటం అంటే.. ఇక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి రష్యాకు నిధులు సమకూరుస్తున్నట్లే అని ఆయన అన్నారు. ట్రంప్ హెచ్చరికల్ని భారత్ ఏమాత్రం లెక్కచేయలేదు.


రష్యానుంచి క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటూ ఉంది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా 50 శాతం టారీఫ్ విధించారు. అయినా కూడా భారత్ వెనక్కు తగ్గలేదు. ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల క్రితం మాట్లాడారు. తాము ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. తమకు భారత ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా తన మిత్ర దేశం భారత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. క్రూడ్ ఆయిల్‌పై ఏకంగా 5 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.


ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడే కొంటాం..

రష్యానుంచి భారత్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవటంపై రష్యాలోని భారత అంబాసిడర్ వినయ్ కుమార్ స్పందించారు. తాజాగా, రష్యా ప్రభుత్వ మీడియా టాస్ ఏజెన్సీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోని ఆయిల్ కంపెనీలు ఆయిల్ ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడే కొంటాయి. భారత ప్రభుత్వానికి దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలకు సరిపడా ఆయిల్ అందించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. రష్యాతో పాటు పలు దేశాలకు భారత్ పరస్పర సహకారం అందించటం వల్ల జాతీయ ఆయిల్ మార్కెట్‌‌తో పాటు అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ నిలకడగా ఉంది. అంతెందుకు.. రష్యాతో అమెరికా కూడా వ్యాపారాలు చేస్తోంది కదా..’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

సీఐఎస్ఎఫ్ చరిత్రలో మొదటి సారి.. రంగంలోకి మహిళా కమాండో టీమ్..

బార్‌.. బేర్‌

Updated Date - Aug 25 , 2025 | 07:46 AM