IndW Vs SLW: చెలరేగిన భారత బ్యాటర్లు.. లంక టార్గెట్ 222
ABN , Publish Date - Dec 28 , 2025 | 08:44 PM
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత మహిళా క్రికెటర్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లకు 221 పరుగులు చేశారు. లంకకు 222 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్దేశించారు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక మహిళా క్రికెట్ జట్టుతో తిరువనంతపురం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా అమ్మాయిలు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 221 పరుగులు సాధించారు. ప్రత్యర్థి శ్రీలంకకు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఓపెనర్లు స్మృతి మంధాన(80; 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులు), షెఫాలీ వర్మ(79; 46 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) యధావిథిగా దంచికొట్టారు. అద్భుత ప్రదర్శనతో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. తృటిలో తమ సెంచరీలను మిస్ చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 162 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రిచా ఘోష్(40*), హర్మన్ ప్రీత్ కౌర్(16*) నాటౌట్‌గా నిలిచారు. వీరిద్దరూ కలిసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రీలంక బౌలర్లలో మాల్షా షెహనీ, నిమిషా మదుషని చెరో వికెట్ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు