SA 20: అదృష్టం అంటే ఇది.. క్యాచ్ పట్టాడు కోటీశ్వరుడయ్యాడు!
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:24 PM
మ్యాచ్ చూడటానికి వెళ్లి.. బ్యాటర్ కొట్టిన సిక్సర్ బంతిని పట్టుకుని కోటీశ్వరుడయ్యాడు ఓ కుర్రాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్యాచ్‌లలో ఒకటిగా నిలిచిన ఈ ఘటన.. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 తొలి మ్యాచులో జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: మ్యాచ్ చూసేందుకు స్టేడియాలు వెళ్లడమే ఎంతో మంది కల.. మరి స్టేడియానకి వెళ్లి రూ.కోట్లు సంపాదించే అదృష్టం వరిస్తే! అక్షరాలా అదే జరిగింది. మ్యాచ్ చూడటానికి వెళ్లి.. బ్యాటర్ కొట్టిన సిక్సర్ బంతిని పట్టుకుని కోటీశ్వరుడయ్యాడు ఓ కుర్రాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన క్యాచ్‌లలో ఒకటిగా నిలిచిన ఈ ఘటన.. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 తొలి మ్యాచులో జరిగింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
డర్బన్ సూపర్ జెయింట్స్, ఎంఐ కేప్ టౌన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్(SA20 2025) రికార్డులకు వేదికైంది. మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ జట్టు 232/5 భారీ స్కోరు సాధించింది. ఇది SA20 చరిత్రలోనే అత్యధిక స్కోరు. కివీస్ ద్వయం కాన్వే (64), కేన్ విలియమ్సన్ (40) శుభారంభాన్ని అందించారు. మార్క్‌రమ్, ఇవాన్ జోన్స్ చివర్లో మెరుపులు మెరిపించారు. అనంతరం 233 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన MI కేప్ టౌన్ కూడా గట్టిగానే పోరాడింది. ర్యాన్ రికెల్టన్ 113 పరుగులతో వీరోచిత సెంచరీ చేసినప్పటికీ, ఆ జట్టు 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండు జట్లు కలిపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 449 పరుగులు సాధించాయి.
ఆ సిక్సర్..
ఈ పరుగుల ప్రవాహంలో ర్యాన్ రికెల్టన్ కొట్టిన ఒక భారీ సిక్సర్ ఒక అభిమానిని కోటీశ్వరుడిని చేసింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రికెల్టన్ బంతిని స్టాండ్స్‌లోకి బాదగా.. అక్కడ కూర్చున్న ఒక యువకుడు అద్భుతంగా ఒంతి చేత్తో క్యాచ్ పట్టాడు. SA20 లీగ్‌లో అమల్లో ఉన్న క్లీన్ క్యాచ్ ఇనిషియేటివ్ ప్రకారం.. ఒక చేత్తో క్లీన్‌గా క్యాచ్ పట్టే అభిమానులకు భారీ బహుమతి లభిస్తుంది. దీని కింద ఆ అభిమాని 2 మిలియన్ రాండ్స్ (సుమారు రూ.1.08కోట్లు) గెలుచుకున్నాడు. స్టేడియం అంతా ఒక్కసారిగా ఆ అభిమానిని చూసి కేరింతలు కొట్టింది.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు