IndW Vs SLW: టాస్ ఓడిన భారత్.. జట్టుకు జెమీమా దూరం!
ABN , Publish Date - Dec 28 , 2025 | 06:51 PM
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత మహిళా క్రికెట్ జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. టాస్ ఓడిన భారత్.. తొలుత బ్యాటింగ్ చేయనుంది. అనారోగ్యం కారణంగా జెమీమా ఆటకు దూరమైంది.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక మహిళల క్రికెట్ జట్టుతో ఐదు టీ20ల పోరులో వరసుగా మూడు మ్యాచులు గెలిచి ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకుంది భారత్. ఇక మిగిలిన రెండు మ్యాచుల్లోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో ఉన్న హర్మన్ సేన.. ఆదివారం నాలుగో టీ20కి సిద్ధమైంది. అయితే తిరువనంతపురం వేదికగా జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన శ్రీలంక.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా అమ్మాయిలు తొలుత బ్యాటింగ్‌కి దిగనున్నారు. ఈ సిరీస్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేయడం ఇదే మొదటి సారి.
అనారోగ్యం కారణంగా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ జట్టుకు దూరమైంది. క్రాంతి గౌడ్‌కి విశ్రాంతినిచ్చింది. దీంతో వీరి స్థానాల్లో హర్లీన్ డియోల్, అరుంధతీ రెడ్డి జట్టులో వచ్చారు.
భారత తుది జట్టు:
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్ జోత్ కౌర్, అరుంధతీ రెడ్డి, వైష్ణవి శర్మ, రేణుకా సింగ్, శ్రీచరణి.
శ్రీలంక తుది జట్టు:
హాసిని పెరెరా, చమరి ఆటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిశా దిల్హారి, ఇమేషా దులానీ, నిలాక్షికా సిల్వా, కౌశనీ న్యుతాంగన(వికెట్ కీపర్), షెహనీ, రష్మికా, కాయా కవిందు, నిమేషా మదుషానీ.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు