IndW Vs SLW: స్మృతి మంధాన ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Dec 28 , 2025 | 08:27 PM
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత జట్లు నాలుగో టీ20లో తలపడతున్నాయి. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఓ కీలక మైలురాయిని అందుకుంది. 10వేల పరుగుల క్లబ్‌లో చేరిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో కీలక మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్ చరిత్రలో 10వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాటర్‌గా, ఓవరాల్‌గా నాలుగో బ్యాటర్‌గా రికార్డులెకెక్కింది.
అత్యధిక రన్స్ చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో స్మృతి(Smriti Mandhana) కంటే ముందు.. మిథాలీ రాజ్(10,868) అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్(10,652), ఇంగ్లండ్‌కి చెందిన షార్లెట్(10,273) ఉన్నారు. కాగా స్మృతి(80) శ్రీలంకతో మ్యాచులో 11 ఫోర్లు, 3 సిక్సుతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. అద్భుత ప్రదర్శనతో దూకుడు ప్రదర్శించి తన టీ20 కెరీర్‌లో 32వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది.
మ్యాచ్ విషయానికొస్తే..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆది నుంచి అద్భుత ప్రదర్శన చేస్తుంది. 18.3 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేశారు బ్యాటర్లు. షెఫాలీ వర్మ(79), స్మృతి మంధాన(80) తృటిలో సెంచరీలు మిస్ చేసుకున్నారు. క్రీజులో రిచా ఘోష్(33), హర్మన్ ప్రీత్ కౌర్(5) ఉన్నారు.
ఇవి కూడా చదవండి
వన్డే సిరీస్‌లో పంత్‌పై వేటు.. జట్టులోకి సంచలన బ్యాటర్!
సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్.. పాక్ స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు