Rishabh Pant: రోహిత్, కోహ్లీ కాదు.. నా ఇన్‌స్పిరేషన్ అతడే: పంత్
ABN , Publish Date - Jan 06 , 2025 | 03:13 PM
టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ కమ్‌బ్యాక్ తర్వాత అదరగొడుతున్నాడు. మునుపటి రేంజ్‌లో కాకపోయినా అడపాదడపా మంచి ఇన్నింగ్స్‌లతో మెరుస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కొన్ని బ్యూటిఫుల్ నాక్స్‌తో ఆకట్టుకున్నాడు.

టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ కమ్‌బ్యాక్ తర్వాత అదరగొడుతున్నాడు. మునుపటి రేంజ్‌లో కాకపోయినా అడపాదడపా మంచి ఇన్నింగ్స్‌లతో మెరుస్తున్నాడు. రీసెంట్‌గా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కొన్ని బ్యూటిఫుల్ నాక్స్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సిడ్నీ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారీ సిక్సులు, బౌండరీలతో ఆసీస్‌ను కంగారు పెట్టాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు విరామం దొరకడంతో అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ తరుణంలో అతడు తన జీవితం, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే తన హీరో అన్నాడు. పంత్ ఇంకా ఏమన్నాడంటే..
మాహీతోనే పంచుకుంటా..
ధోని తన రోల్‌మోడల్ అని అన్నాడు పంత్. అతడే తన మార్గదర్శి అని చెప్పాడు. టీమిండియాకు రెండుసార్లు వరల్డ్ కప్‌ను అందించిన మాహీ చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రశంసలు కురిపించాడు. అతడ్ని రీప్లేస్ చేయడం కష్టమని.. కానీ ఆ దిశగా తాను ప్రయాణం సాగిస్తున్నానని తెలిపాడు. ధోని దేశానికి హీరో అన్న పంత్.. క్రికెటర్‌గా అతడి నుంచి ఎన్నో అంశాలను తాను నేర్చుకున్నానని పేర్కొన్నాడు. అతడు ఉన్నాడంటే టీమ్‌లో నమ్మకం పెరుగుతుందన్నాడు. ఏ సమస్య ఉన్న మాహీతో షేర్ చేసుకుంటానని వ్యాఖ్యానించాడు పంత్.
పోలిక ఎందుకు?
‘ధోని అందరి ఫేవరెట్ క్రికెటర్. ఈ దేశానికి అతడో హీరో. పర్సనల్, ప్రొఫెషనల్‌గా అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఏ సమస్య ఉన్నా దానికి చిటికెలో పరిష్కారం కనిపెట్టడం అతడి ప్రత్యేకత. వికెట్ కీపర్‌గా, ప్లేయర్‌గా ఓర్పు ఎంత కీలకమో ధోని నేర్పాడు. అదే అతడు నాకు ఇచ్చిన సలహా. కూల్‌గా ఉంటూ 100 పర్సెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించాలని సూచిస్తుంటాడు. అతడి రికార్డుల విషయాన్ని నేను కంపేర్ చేసుకోను. అయినా పోలిక ఎందుకు? అతడు నాకు స్ఫూర్తి. క్యాచెస్ పట్టడం మ్యాచ్‌లో చాలా కీలకం. దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని పంత్ చెప్పుకొచ్చాడు.