American Flag Football: అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ 2025లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ విజేతలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 07:54 PM
అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ - 2025 ఆదివారం హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో విజయవంతంగా ముగిసింది. ఇందులో పురుషుల విభాగంలో కర్ణాటక, మహిళల విభాగంలో ఉత్తరప్రదేశ్ ఛాంపియన్‌లుగా నిలిచాయి.
హైదరాబాద్, ఆగస్టు 31, (ఆంధ్రజ్యోతి): అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ (American Flag Football) నేషనల్ చాంపియన్‌షిప్- 2025 ఈ రోజు హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో విజయవంతంగా ముగిసింది. ఇందులో పురుషుల విభాగంలో కర్ణాటక విజేతగా నిలవగా, మహిళల విభాగంలో ఉత్తరప్రదేశ్ ఛాంపియన్‌గా అవతరించింది. ఉత్కంఠభరితమైన పురుషుల ఫైనల్లో కర్ణాటక తెలంగాణను 19-12 తేడాతో ఓడించింది. మహిళల ఫైనల్లో ఉత్తరప్రదేశ్ కర్ణాటకపై 20-0తో భారీ విజయం సాధించింది.

బ్రాంజ్ మెడల్ పోరులో, పురుషుల విభాగంలో కేరళ 28-6 తేడాతో ఉత్తరప్రదేశ్‌పై గెలిచింది, అలాగే మహిళల విభాగంలో మహారాష్ట్ర 6-0 తేడాతో కేరళను ఓడించింది.అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్‌లో, పురుషుల విభాగంలో తెలంగాణ 20-19తో కేరళను ఓడించగా, కర్ణాటక 31-12తో ఉత్తరప్రదేశ్‌ను ఓడించింది. మహిళల విభాగంలో ఉత్తరప్రదేశ్ 16-0తో మహారాష్ట్రను ఓడించగా, కర్ణాటక 16-0తో కేరళను ఓడించింది.

ఈ టోర్నమెంట్ భారతదేశంలో అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ పెరుగుతున్న ప్రాచుర్యాన్ని ప్రదర్శించింది. ఈ పోటీల్లో అనేక రాష్ట్రాల జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. వాలెడిక్టరీ కార్యక్రమంలో ప్రసంగించిన ఆర్గనైజేషన్ కమిటీ అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్ క్రీడాకారుల పోటీ స్ఫూర్తిని మాత్రమే కాకుండా, ఈ క్రీడ మరింత విస్తరించి కొత్త ప్రతిభను ప్రేరేపించే సామర్థ్యాన్ని కూడా స్పష్టంగా చూపించిందని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి
హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంప ఛెళ్లుమనిపించిన ఘటన.. పాత వీడియోను షేర్ చేసిన లలిత్ మోదీ
చెంపదెబ్బ వీడియో రిలీజ్.. లలిత్ మోదీపై శ్రీశాంత్ భార్య ఆగ్రహం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి