Man Death Live Video: అయ్యో.. ఎంత ఘోరం.. సెకన్ల వ్యవధిలో ఎలా చనిపోయాడో చూడండి..
ABN , Publish Date - Aug 17 , 2025 | 09:15 PM
ఓ పేపర్ మిల్లులో కొందర కార్మికులు పని చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు లోపల ఉన్న వేస్ట్ పేపర్‌ను మొత్తం ఒకచోటకు చేర్చుతున్నాడు. చెత్తాచెదారాన్ని మొత్తం కాలితో తోస్తూ ఓ చోటికి చేరుస్తున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. సంతోషంగా ఉన్న వారిని సడన్‌గా తన ఒడిలోకి లాక్కుంటుంది. కొందరి మరణం చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరు చనిపోయే విధానం చూస్తే అయ్యో.. పాపం.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అప్పటిదాకా పని చేసుకుంటున్న యువకుడు.. క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అయ్యో.. ఎంత ఘోరం జరిగింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పేపర్ మిల్లులో (Paper Mill) కొందర కార్మికులు పని చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ యువకుడు లోపల ఉన్న వేస్ట్ పేపర్‌ను మొత్తం ఒకచోటకు చేర్చుతున్నాడు. చెత్తాచెదారాన్ని మొత్తం కాలితో తోస్తూ ఓ చోటికి చేరుస్తున్నాడు.
ఆ పక్కనే పెద్ద పేపర్ రోల్ వేగంగా తిరుగుతుంటుంది. కాసేపటి తర్వాత ఆ యువకుడు కాలితో ఆ పేపర్ రోల్ కింద చెత్తను తోసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో కాలు రోలర్ మధ్యలో ఇరుక్కుంటుది. చూస్తుండగానే క్షణాల వ్యవధిలో మనిషిని మొత్తం అందులోకి లాక్కుంటుంది. ఇంతలో అక్కడున్న వారు గమనించి మిషిన్‌ను ఆపేశారు. అయితే (Man dies after falling under paper roll) అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలీదు గానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అయ్యో .. ఎంత ఘోరం జరిగింది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 2.87 లక్షల మంది వీక్షించారు.
ఇవి కూడా చదవండి..
చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..
కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి