Share News

Funny Metro Video: చెంపదెబ్బ కొట్టిన యువతిపై యువకుడి రివేంజ్‌.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Aug 17 , 2025 | 08:26 PM

ఓ మెట్రో రైల్లోప్రయాణికులు రద్దీగా ఉంటారు. ఈ సమయంలో వారి మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిలబడి ఉన్న ఓ యువకుడు పొరపాటున అదుపుతప్పి తూలి పక్కన ఉన్న యువతిపై పడ్డాడు. దీంతో ఆమె అతడి చెంప చెల్లుమనిపిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Funny Metro Video: చెంపదెబ్బ కొట్టిన యువతిపై యువకుడి రివేంజ్‌.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..

మెట్రో రైళ్లు రోజు రోజుకూ వింతలు, విశేషాలకూ వేదికలుగా మారుతున్నాయి. కొన్నిసార్లు సినిమా తరహా కామెడీ సంఘటనలు చోటు చేసుకుంటుంటే.. మరికొన్నిసార్లు వాటికి మించిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి మెట్రో రైల్లో యువడిని చెంపదెబ్బ కొట్టింది. అయితే చివరకు ఆ యువకుడు ఆమెపై ప్రతీకారం తీర్చుకున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మెట్రో రైల్లో (Metro Train) ప్రయాణికులు రద్దీగా ఉంటారు. ఈ సమయంలో వారి మధ్యలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిలబడి ఉన్న ఓ యువకుడు పొరపాటున అదుపుతప్పి తూలి పక్కన ఉన్న యువతిపై పడ్డాడు. అయితే వెంటనే తేరుకుని మళ్లీ సరిగ్గా నిలబడతాడు.


అయితే తన మీద పడగానే ఆమెకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ముందూ వెనుకా చూడకుండా (Young woman slapped young man) అతడిని చెంప చెల్లుమనిపిస్తుంది. అందరి ముందూ యువతి కొట్టినా అతను కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. అదును కోసం వేచి చూస్తుంటాడు. డోరు వద్ద నిలబడి ఉన్న అతను.. స్టేషన్ రాగానే కిందకు దిగే క్రమంలో అక్కడే ఉన్న యువతి చెంప చెల్లుమనించాడు. ఆ వెంటనే ఫ్లాట్‌ఫామ్‌ పైకి దిగిపోయాడు. చెంపదెబ్బ కొట్టగానే ఆమె ఒక్కసారిగా అవాక్కవుతుంది. పక్కన ఉన్న వారంతా ఈ సీన్ చూసి పగలబడి నవ్వుకుంటారు.


చూస్తుంటే.. ఇదంతా వ్యూస్ కోసం చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘దీన్నే టిట్ ఫర్ టాట్ అని అంటారు.. ఇప్పుడు ఎలాంటి ఫిర్యాదులూ ఉండవు’.. అంటూ కొందరు, ‘రివేంట్ కంప్లీటెడ్’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 1.26 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

చేపలు పడుతున్న వ్యక్తి.. వెనుకే వెళ్లిన సింహం.. చివరకు చూస్తే..

కోతులను కర్రతో తరిమికొట్టాడు.. చివరకు జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 08:26 PM