Share News

Health Tips: చికెన్‌‌తో పాటూ ఎముకలు కూడా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:54 PM

చికెన్ తినే సమయంలో చాలా మంది చిన్న చిన్న ఎముకలను నమిలేస్తుంటారు. అయితే ఇలా చికెన్‌తో పాటూ ఎముకలు కూడా తినడం మంచికంటే చెడే ఎక్కువగా చేస్తుందట. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

Health Tips: చికెన్‌‌తో పాటూ ఎముకలు కూడా తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

చికెన్ ఇష్టపడని నాన్‌వెజ్ ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగే చాలా మంది చికెన్ తిన్న తర్వాత ఎముకలు నమిలేందుకు ఇష్టపడతారు. అయితే ఇలా చికెన్ తినే సమయంలో ఎముకలను కూడా తినడం మంచిదా, కాదా.. అనే దానిపై కొందరికి సందేహం ఉంటుంది. అసలు చికెన్ ఎముకలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా, లేవా అనే దానిపై కూడా చాలా మందికి అవగాహన ఉండదు. దీనిపై నిపుణులు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


చికెన్ తినే (Chicken curry) సమయంలో చాలా మంది చిన్న చిన్న ఎముకలను (Bone) నమిలేస్తుంటారు. అయితే ఇలా చికెన్‌తో పాటూ ఎముకలు కూడా తినడం మంచికంటే చెడే ఎక్కువగా చేస్తుందట. కోడి ఎములను తినడం వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమంగా పెంచిన కోడి ఎముకలు శరీరానికి హాని చేస్తాయట. అలాగే అనేక వ్యాధులు సోకడానికి కూడా కారణమవుతుందట.


chicken-bones.jpg

చికెన్ ఎముకలను తినడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వంటి అనేక ప్రమాదకర వ్యాధులు (Dangerous diseases) సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఎముకలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఎముకల్లో ఉండే హార్మోన్లు, యాంటీబయాటిక్ అవశేషాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కోడి ఎముకలు మానవ శరీరంలోకి వెళ్తే.. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఎముకలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో ప్రేగులలో అడ్డంకులు లేదా గాయాలకు కారణం కావచ్చు.


చికెన్ ఎముకలు తినే సమయంలో మరో ప్రమాదం కూడా ఉంటుంది. గొంతులో ఇరుక్కుపోతే ప్రమాదకరంగా మారొచ్చు. చిన్న చిన్న ఎముకలు అన్నవాహిక, శ్వాసనాళం, లేదా ప్రేగులలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ముక్కలు శ్వాసనాళంలో ఇరుక్కుపోతే ఊపిరాడక మృత్యువుకు కూడా కారణం కావచ్చు. చాలామంది కోడి ఎముకలోని మజ్జను తినడానికి ఇష్టపడతారు. అయితే పలు అధ్యయనాల ప్రకారం.. ఎముక మజ్జను తినడం మంచిది కాదట. ఇది అనారోగ్య సమస్యలను కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

ప్రియురాలి అత్యుత్సాహం.. రెండో అంతస్తులో పరుగెత్తుకుంటూ రావడంతో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Aug 12 , 2025 | 05:02 PM