Daughter Fulfills Fathers Dream: తన ఫస్ట్ శాలరీతో నాన్నకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చి.. వారెవ్వా అనిపించుకుందిగా..!
ABN , Publish Date - Sep 03 , 2025 | 02:45 PM
జీవితంలో తొలి సంపాదన ఎవరికైనా ప్రత్యేకమే. దాన్ని మరింత స్పెషల్ మెమొరీగా మార్చుకుంది ఓ యువతి. తన మొదటి జీతంతో తండ్రి 30 ఏళ్ల కలను నెరవేర్చి సర్ ప్రైజ్ చేసింది. నాన్న చిరకాల కోరికను తీర్చేందుకు తొలి జీతం మొత్తాన్ని ఖర్చు చేసిన ఆమె ప్రేమకు వెలకట్టలేమని నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు.
ఫస్ట్ శాలరీని జీవితాంతం గుర్తుండిపోయేలా ఖర్చు చేయాలని అనుకోనివారు అరుదు. ఇక చాలామంది యువత తొలి జీతాన్ని ఫ్రెండ్స్, ఫ్యామిలీకి పార్టీ ఇవ్వడానికో, గాడ్జెట్స్ లేదా వెకేషన్స్ ఇలా వివిధ రకాలుగా ప్లాన్ చేసుకుంటారు. కానీ, ఓ యువతి ఇంకా డిఫరెంట్ గా థింక్ చేసింది. మొదటి జీతాన్ని తండ్రి 30 ఏళ్ల కల నెరవేర్చేందుకు ఉపయోగించింది. ముంబైలోని ఐకానిక్ తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో నాన్న బస చేసేందుకు జీతం మొత్తాన్ని ఖర్చు చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటే ఈమె కదా అని ఆమెను ఆకాశానికెత్తేస్తున్నారు.
మీ ఫస్ట్ శాలరీ ఎలా ఖర్చు చేశావ్ అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ వినిపిస్తారు. తక్కువా.. ఎక్కువా.. అని లేకుండా తొలి సంపాదన ఎవరికైనా ప్రత్యేకమే మరి. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఓ యువతి భిన్నంగా ఆలోచించింది. ఫస్ట్ శాలరీ అకౌంట్లో పడిన మరుక్షణం వేరే ఆలోచన లేకుండా నాన్న చిరకాల స్వప్నం నిజం చేయాలని డిసైడ్ అయింది. దశాబ్దాల క్రితం తాను కన్న కల కూతురి ద్వారా సాకారం కావడంతో ఆయన ఆనందాన్ని అవధుల్లేకుండా పోయాయి. ఈ అనుభవాన్ని ఆమె రెడ్డిట్ వేదికగా పోస్ట్ చేసింది. కెరీర్లో 18 నెలల గ్యాప్ తర్వాత వచ్చి తొలి సంపాదనతో నాన్నకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడం సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చింది.
ఆమె ఆ పోస్టులో ఇలా రాసుకొచ్చింది. 'చాలా ఏళ్ల క్రితం మా నాన్నతో కలిసి ముంబైలోని తాజ్ హోటల్ ముందు నడుచుకుంటూ వెళ్లేటప్పుడు ఆయన నాకో విషయం చెప్పారు. అమ్మతో కలిసి ఈ హోటళ్లో స్టే చేయాలనేది తన కల అని అన్నారు. ఓ సారి అమ్మతో కలిసి తాజ్ హోటల్ ఎదురుగా ఫొటో దిగారు. ఆ పాత ఫోటో ఇప్పటికీ నాకు ఇష్టమైన ఫోటో. నేను టీనేజర్‌గా ఉన్నప్పుడే నా తల్లి చనిపోయింది. కానీ, ఈసారి నాకు వచ్చిన శాలరీతో నాన్న కోరిక తీర్చాలనుకున్నా. ఫస్ట్ శాలరీతో తాజ్ హోటళ్లో రూం బుక్ చేశా. ఆ హోటల్‌లోని గ్రాండ్ హాళ్ల గుండా ఆయన నడుస్తూ చిన్న పిల్లాడిలా నవ్వుతూ ఎంజాయ్ చేయడం నాకెంతో అమూల్య క్షణాలు. హోటల్ సిబ్బందిఈ క్షణాన్ని ప్రత్యేకంగా చేయడానికి చాలా కష్టపడ్డారు. వారు గదిని పూలతో డెకరేట్ చేసి కొన్ని సంవత్సరాల క్రితం అదే స్థలంలో తీసిన మా అమ్మ ఫోటోను పెట్టి కేక్ కటింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఇవి నిజంగా అద్భుతమైన క్షణాలు.' అని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
ఇన్ని తెలివితేటలు ఎక్కడివి భయ్యా.. ఈ బైక్‌ను దొంగిలించడం ఎవరి తరమూ కాదు..
ఈ ఆంటీ తెలివికి వాషింగ్ మెషిన్ కంపెనీలు షాక్.. ఈ వాషింగ్ మెషిన్ చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..