Monsoon Home Tips: వానాకాలంలో గోడలపై తేమ, ఫంగస్..ఈ చిట్కాలతో మాయం.!
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:26 PM
వానాకాలంలో ఇంటి గోడలపై వచ్చే తేమ, ఫంగస్ చాలా చికాకుగా ఉంటుంది. అయితే, కొన్ని చిట్కాలతొ వాటిని మాయం చేసేయచ్చు.! అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: వానాకాలం వచ్చిందంటే చల్లదనం తోపాటు కొన్ని చికాకులు కూడా వస్తుంటాయి. ఇంట్లో తేమ పెరగడం, గోడలపై ఫంగస్, చెదురు మచ్చలు ఇవన్నీ ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. ముఖ్యంగా గాలివాటానికి లోనవని గదుల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వీటిని సమర్థవంతంగా తొలగించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
గాలికి ప్రాధాన్యత ఇవ్వండి
రోజూ కిటికీలు, తలుపులు ఓపెన్ చేసి గాలి ప్రవాహం ఉండేలా చూడండి. గదుల్లో తడి నిలిచిపోయే అవకాశం లేకుండా, గాలి ప్రవాహం ఉండేలా చేస్తే ఫంగస్ ఏర్పడే ఛాన్స్ తక్కువగా ఉంటుంది.
ఫర్నిచర్‌ను దూరంగా పెట్టండి
అల్మారాలు, సోఫాలు గోడలకి కొంచెం దూరంగా ఉంచాలి. ఎందుకంటే, దగ్గరగా ఉంచితే ఆ ప్రదేశాల్లో ఫంగస్ ఏర్పడుతుంది. కాబట్టి, ఫర్నిచర్‌ను గోడలకు కనీసం కొన్ని అంగుళాల దూరం ఉంచడం మంచిది.
క్లోరిన్ బ్లీచ్ ఉపయోగించండి
తేమ మచ్చలు గోడలపై బలంగా కనిపిస్తే, కొద్దిగా క్లోరిన్ బ్లీచ్ ను నీటిలో కలిపి గోడపై అప్లై చేయండి. ఇది ఫంగస్‌ను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. కానీ దీన్ని వాడేటప్పుడు గ్లౌజులు, మాస్క్, కళ్లజోడు ధరించడం మర్చిపోవద్దు.
వానాకాలంలో ఇంట్లో తేమని తక్కువ చేయడం, శుభ్రతను మెరుగుపరచడం చాలా అవసరం. తేమ, ఫంగస్ సమస్యలు కేవలం ఇంటి అందాన్ని తగ్గించడమే కాకుండా ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతాయి. పై సూచనలతో మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుతూ, కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు. అలాగే, తడి బట్టలను గదిలో వదిలిపెట్టకుండా వెంటనే బయట ఆరబెట్టండి. ఇంట్లో తడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో గాలి తిరగేలా క్లోజెట్‌లు, కిచెన్ క్యాబినెట్లను అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఉంచాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
కుట్రదారుడు హరీశే.. కవిత సంచలన ఆరోపణలు
త్వరగా కోటీశ్వరులు కావాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి..
For More Latest News