Share News

Investment Tips: త్వరగా కోటీశ్వరులు కావాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి..

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:20 PM

ఇటీవల కాలంలో అనేక మంది కూడా మ్యూచువల్ ఫండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతులతో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్లలో మెరుగైన లాభాలకు అవకాశం ఉంది. అయితే త్వరగా కోటీశ్వరులు కావాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Investment Tips: త్వరగా కోటీశ్వరులు కావాలంటే నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి..
Investment Tips

ఇటీవల కాలంలో అనేక మంది కూడా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్లవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవి ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతులతో పోల్చితే మంచి ఫ్లెక్సిబిలిటీతో పాటు ఎక్కువ రాబడులను అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్లలో మనం ఇన్వెస్ట్ చేసే మొత్తం, వ్యవధి (tenure)తోపాటు అనేక ఆప్షన్లు ఉంటాయి. అయితే మీరు రూ.1 కోటి సొమ్మును త్వరగా సేవ్ చేయాలంటే, నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏన్నేళ్లు చేయాలనే తదితర విషయాలను ఇప్పుడు చూద్దాం.


SIP అంటే ఏమిటి?

SIP (Systematic Investment Plan) అనేది ప్రతి నెలా లేదా పరిమిత కాలంలో ఒక చిన్న మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే విధానం. ఈ విధానం చిన్న మొత్తాలతో మొదలుపెట్టి, ఎక్కువ మొత్తాన్ని కూడబెట్టే అవకాశాన్ని ఇస్తుంది. దీనిలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల మీరు పొందే రాబడుల మీద కూడా లాభాలు వస్తాయి. అంటే మీరు మొదట పెట్టిన మొత్తానికి లాభాలు వస్తే, ఆ లాభాలు కూడా తిరిగి స్కీమ్‌లో చేరి, తర్వాత కాలంలో వాటిపైనా లాభాలు వస్తాయి. దీని వల్ల మీ మొత్తం పెట్టుబడి భారీగా పెరుగుతుంది.


చేసిన పెట్టుబడికి..

ఈ నేపథ్యంలో మీరు ప్రతి నెలా రూ.16,500 సిప్ రూపంలో 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే, సగటున 15% వార్షిక రాబడి వస్తే, మీకు వచ్చే మొత్తం రూ.1 కోటి దాటే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చేసిన పెట్టుబడి రూ.29,70,000 కాగా, మీకు వడ్డీ రూపంలోనే రూ.72,00,032 లభిస్తాయి. అంటే మీకు 15 ఏళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి దాదాపు నాలుగింతల మొత్తం (రూ.1,01,70,032) వచ్చే ఛాన్సుంది. సాధారణంగా వార్షిక రాబడి రేటు ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్లలో కనీసం 12 శాతం నుంచి 21 శాతం వరకు వస్తుంది.


సిప్ వల్ల లాభాలు ఏంటి

  • ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడి చేస్తూ పెట్టుబడి చేసే అలవాటు పెరుగుతుంది. దీని వల్ల మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు పెట్టుబడి కొనసాగించవచ్చు.

  • మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు ఎక్కువ, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది

  • సిప్ వల్ల మార్కెట్ పతనమైనప్పుడు ఎక్కువ units, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ units కొనుగోలు చేయాలి. దీని వల్ల సగటు కొనుగోలు ధర తక్కువ అవుతుంది

  • మీరు తొందరగా పెట్టుబడులు చేయడం ప్రారంభిస్తే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల మీ పెట్టుబడి దీర్ఘకాలంలో బారీగా పెరుగుతుంది

  • ELSS (Equity Linked Savings Scheme) లాంటి SIPలు అయితే, 80C ప్రకారం టాక్స్ మినహాయింపు పొందవచ్చు


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2025 | 01:20 PM