Insurance Policy Issue: రూ.2.40 కోట్ల కవర్ ఉన్నప్పటికీ రూ.61 లక్షల క్లెయిమ్ తిరస్కరణ నిజమేనా ..పోస్ట్ వైరల్
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:16 PM
మనం ఏళ్ల తరబడి బీమా ప్రీమియంలు కడతాం. కష్ట కాలంలో ఆసరాగా ఉంటుందని భారీ బీమా కవర్ తీసుకుంటాం. కానీ, నిజంగా అవసరం వచ్చినప్పుడు బీమా కంపెనీ మనల్ని మధ్యలో వదిలేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇన్సూరెన్స్ ఉంటే చాలు... కష్టం వచ్చినప్పుడు కాపాడుతుందనే నమ్మకంతో చాలామంది ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు చేసి హెల్త్ పాలసీలు తీసుకుంటారు. కానీ, నిజంగా ఆ పాలసీలు అవసరం వచ్చినప్పుడు మనల్ని కాపాడతాయా అన్న ప్రశ్న చాలా మందికి కలుగుతోంది. ఎందుకంటే ఇటీవల ఒక వైరల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అవిగ్యాన్ మిత్రా అనే వ్యక్తి చేసిన ఈ పోస్ట్‌లో ఓ వ్యక్తి చికిత్స కోసం పెట్టిన రూ.61 లక్షల నగదు రహిత క్లెయిమ్‌ను, ఆయన వద్ద ఉన్న రూ.2.40 కోట్ల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా సరే, తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు (Insurance Policy Issue).

సమస్య ఎలా మొదలైంది?
అవిగ్యాన్ మిత్రా వెల్లడించిన వివరాల ప్రకారం:
చంద్ర కుమార్ జైన్ కు రూ. 2.4 కోట్ల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది (రూ. 1 కోటి బేస్ పాలసీ + రూ. 1.4 కోట్లు నో-క్లెయిమ్ బోనస్).
అయినప్పటికీ, ఇన్సూరెన్స్ కంపెనీ ఒక్కసారిగా లైయాబిలిటీ ఎస్టాబ్లిష్ చేయలేమనే కారణంతో క్యాష్‌లెస్ మంజూరు చేయలేదని చెప్పారు.
మీరు ఏళ్ల తరబడి ప్రీమియం కడతారు, భారీ కవర్ తీసుకుంటారు. కానీ అసలు సమయంలో బీమా కంపెనీ మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తుందని అవిగ్యాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చిన్న టెక్నికల్ సమస్య కాదని, హెల్త్ ఇన్సూరెన్స్ ఆయా కుటుంబాలకు కష్ట సమయంలో అండగా నిలవాలన్నారు. ఇది కేవలం చిన్న పొరపాటు కాదు. ఇది ఆరోగ్య భీమా రంగం పట్ల కలిగించిన నమ్మకాన్ని మోసం చేసినట్లేనని అన్నారు.
కంపెనీ సమాధానం
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నివా బుపా మార్కెటింగ్ అధికారి నిమిష్ అగర్వాల్ స్పందించారు.
జూన్ 27న అడ్మిట్ అయిన జైన్ గారికి మొదట్లో రూ. 25 లక్షల ప్రీ ఆథరైజేషన్ (cashless approval) మంజూరు చేశామని చెప్పారు.
అయితే ట్రీట్మెంట్ ఖర్చులు ఇప్పుడు రూ. 70 లక్షలకి మించి పోయాయని, ఇది సాధారణమైనది కాదన్నారు.
రోగి ఇంకా ఆస్పత్రిలో ఉన్నందున, తుది క్లెయిమ్ ఇంకా మంజూరు చేయలేదని, కానీ తిరస్కరించలేదన్నారు.
హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఖర్చులు న్యాయంగా ఉన్నాయా అనేది హాస్పిటల్‌తో కలిసి చర్చించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.
ప్రజల ఆగ్రహం
ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలో ఇన్సూరెన్స్ పేరుతో మోసం చేస్తున్నారని అనేక రకాలుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం బీమా తీసుకునేటప్పుడు దాని నిబంధనలను స్పష్టంగా అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ విధంగా ఇన్సూరెన్స్ రాదు, ఎలా వస్తుందనేది ముందే తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి