Elephant strength: ఏనుగు బలం రేంజ్ ఇది.. భారీ చెట్టును ఎంత సులభంగా పడగొట్టిందో చూడండి..
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:13 PM
ఈ భూమి మీద అత్యంత భారీ జంతువు ఏనుగు. ఏనుగు భారీ శరీరం, బలం తెలివితేటలు దానిని ఇతర జంతువుల కంటే శక్తివంతంగా మారుస్తాయి. ఏనుగు తన తొడంతో ఎంత శక్తివంతమైన పనినైనా సునాయాసంగా చేయగలదు.
ఈ భూమి మీద అత్యంత భారీ జంతువు ఏనుగు. ఏనుగు భారీ శరీరం, బలం తెలివితేటలు దానిని ఇతర జంతువుల కంటే శక్తివంతంగా మారుస్తాయి. ఏనుగు తన తొడంతో ఎంత శక్తివంతమైన పనినైనా సునాయాసంగా చేయగలదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో (viral elephant video) చూస్తే ఏనుగు తొండంలో ఎంత శక్తి దాగుంతో అర్థమవుతుంది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (elephant uproots tree).
@AMAZlNGNATURE అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక ఏనుగు ఓ భారీ వృక్షం దగ్గర నిలబడి ఉంది. అది తన తొండంతో చెట్టును బలంగా ఊపుతోంది. కాసేపటి తర్వాత ఆ చెట్టు ఒక్కసారిగా విరిగి కిందపడిపోయింది. ఈ వీడియో చూస్తే ఏనుగుకు, దాని తొండానికి ఉన్న శక్తి ఏంటో అర్థమవుతుంది. ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన యూజర్.. 'ఏనుగు బలం అద్భుతమైనది' అని కామెంట్ చేశారు (powerful elephant).
ఈ వీడియో (wildlife video) సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 5.5 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు పది వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. మాంసాహారం తినే జంతువులు మరింత శక్తివంతమైనవని కొందరు భావిస్తుంటారని, అది అబద్ధమని ఈ ఏనుగు రుజువు చేసిందని ఒకరు కామెంట్ చేశారు. ఏనుగు తన తొండంతో ఎంత అసాధ్యమైన పనినైనా చేయగలదని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇన్ని తెలివితేటలు ఎక్కడివి భయ్యా.. ఈ బైక్‌ను దొంగిలించడం ఎవరి తరమూ కాదు..
మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో మిస్టేక్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..