Share News

Actor Raj Tarun Booked Again: లావణ్య ఫిర్యాదు.. హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:37 PM

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు నమోదు అయింది. కోకాపేటలోని విల్లాలో ఉండగా రాజ్ తరుణ్ అనుచరులను పంపి తనపై దాడి చేయించాడని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసింది.

Actor Raj Tarun Booked Again: లావణ్య ఫిర్యాదు.. హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు
Actor Raj Tarun Booked Again

హైదరాబాద్: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు నమోదు అయింది. కోకాపేటలోని విల్లాలో ఉండగా రాజ్ తరుణ్ అనుచరులను పంపి తనపై దాడి చేయించాడని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేసింది. మూడు వేర్వేరు సందర్భాలలో తనను దూషిస్తూ దాడి చేశారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. 2016లో హీరో రాజ్ తరుణ్‌తో కలిసి కోకాపేటలో విల్లా కొనుగోలు చేశానని, వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చి నెలలో రాజ్ తరుణ్ ఇంటిని ఖాళీ చేశాడని లావణ్య తెలిపింది.


విల్లాలో ఉండగా రాజ్ తరుణ్ మనుషులు తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఆమె పేర్కొంది. ఇంటికి సంబంధించిన కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉండగా బెల్టులు, గాజు సీసాలతో కొట్టి, ధరించిన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని లావణ్య తెలిపింది. తన పెంపుడు కుక్కలను కూడా చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్‌తో పాటు మణికంఠ తంబాడీ, రాజ్ శేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజలపై కూడా కేసు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి

బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికీ కవిత రాజీనామా..

వేరే పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కల్వకుంట్ల కవిత

Updated Date - Sep 03 , 2025 | 01:44 PM