Jugaad Trick: ఈ ఆంటీ తెలివికి వాషింగ్ మెషిన్ కంపెనీలు షాక్.. ఈ వాషింగ్ మెషిన్ చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే..
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:26 PM
కొందరు డబ్బును ఖర్చును తగ్గించుకునేందుకు రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తుంటారు. వేల ఖరీదు చేస్తే వస్తువులు చేసే పనులను తమ తెలివితో సులభంగా చేసేస్తుంటారు. అద్భుతమైన ట్రిక్‌లను కనిపెడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కొందరు డబ్బుల ఖర్చును తగ్గించుకునేందుకు రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తుంటారు. వేల ఖరీదు చేస్తే వస్తువులు చేసే పనులను తమ తెలివితో సులభంగా చేసేస్తుంటారు. అద్భుతమైన ట్రిక్‌లను కనిపెడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (jugaad hack) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ మహిళ బట్టలు ఉతుకుతున్న విధానం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది (clever Indian aunty).
@shutup_natasha అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక మహిళ టైర్‌ను చెట్టుకు కట్టి వేలాడదీసింది. టైర్‌లో నీరు నిలిచి ఉండేలా కింది నుంచి మూసివేసింది. ఆ టైర్‌ను నీటితో నింపి అందులో బట్టలు వేసింది (washing machine trick). దీని తర్వాత, ఆమె దానిలో వాషింగ్ పౌడర్ వేసింది. ఆపై ఆ టైర్‌ను బలంగా తిప్పి వదిలింది. వాషింగ్ మెషిన్‌లోని డ్రమ్ తిరుగుతూ బట్టలు ఉతికినట్లుగా, ఇక్కడ కూడా జరుగుతోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 2.7 లక్షల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ తమ స్పందనలను తెలియజేశారు. ఈ ఆంటీకి వాషింగ్ మెషిన్ కంపెనీల నుంచి 99 మిస్డ్ కాల్స్ వచ్చాయని ఒకరు కామెంట్ చేశారు. ఈ మహిళ తెలివికి జోహార్లు అని మరొకరు ప్రశంసించారు. ఈ ట్రిక్ చూస్తే వాషింగ్ మెషిన్ కంపెనీల యజమానులు మూర్ఛపోతారని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇన్ని తెలివితేటలు ఎక్కడివి భయ్యా.. ఈ బైక్‌ను దొంగిలించడం ఎవరి తరమూ కాదు..
మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో మిస్టేక్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..