PM Narendra Modi: ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల కీలక భేటీ.. ఎందుకంటే..
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:53 AM
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తెలుగుదేశం ఎంపీలు సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని టీడీపీ ఎంపీలు విజ్ణప్తి చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయం పట్ల ప్రధానికి ఎంపీలు అభినందనలు తెలిపారు.
ఢిల్లీ, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Narendra Modi) తెలుగుదేశం ఎంపీలు ఇవాళ(సోమవారం) ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏపీ అభివృద్ధికి మరింత సహకారం అందించాలని విజ్ణప్తి చేశారు టీడీపీ ఎంపీలు. ఆపరేషన్ సిందూర్ విజయం పట్ల ప్రధానికి అభినందనలు తెలిపారు ఎంపీలు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఎంపీ అప్పలనాయుడిని ప్రధాని మోదీకి పరిచయం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కొత్త కొత్త విషయాలను అన్వేషిస్తారని, మంచి ఆసక్తి గల వ్యక్తి అంటూ అప్పలనాయుడికి ప్రధాని మోదీ కితాబు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వంతో సినిమా ప్రముఖుల భేటీ.. ఎందుకంటే
For More AndhraPradesh News And Telugu News