Pakistan Closes Airspace: ఉక్కిరిబిక్కిరవుతున్న పాక్.. ఎయిర్‌స్పేస్‌ను మూసేసిందిగా..
ABN , Publish Date - May 10 , 2025 | 09:21 AM
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ గజగజా వణికిపోతోంది. ఈ క్రమంలో భారత్‌పై ఎలాగైనా కక్ష తీర్చువాలనే ఉద్దేశంతో సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు, డ్రోన్లలో దాడులకు తెగబడడం చేస్తోంది. ఈ క్రమంలో పాక్‌కు మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇండియన్ ఆర్మీ స్పీడ్‌ను పెంచింది. దీంతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్.. తన ఎయిర్ స్పేస్‌ను మూసేసింది..
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో (Operation Sindoor) పాకిస్తాన్ గజగజా వణికిపోతోంది. ఈ క్రమంలో భారత్‌పై ఎలాగైనా కక్ష తీర్చువాలనే ఉద్దేశంతో సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు, డ్రోన్లలో దాడులకు తెగబడడం చేస్తోంది. దీంతో పాక్‌కు మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఇండియన్ ఆర్మీ స్పీడ్‌ను పెంచింది. పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. పాకిస్తాన్‌లోని వివిధ నగరాలపై దాడులు చేసింది. దీంతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్.. తన ఎయిర్ స్పేస్‌ను మూసేసింది.
తప్పు మీద తప్పులు చేస్తున్న పాకిస్తాన్‌కు భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమైంది. దీంతో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. భారత్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులకు తెగబడుతోంది. ఇందుకోసం సుమారు 300 నుంచి 400 డ్రోన్‌లను (Drone Attacks) ప్రయోగించింది. విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు సహా కీలకమైన స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే పాక్ ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ విజయవంతంగా అడ్డుకుంటోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్ తదితర నగరాలపై దాడులు చేసింది. భారత్ వరుస దాడులతో బిత్తరపోయిన పాకిస్తాన్.. తమ వైమానిక ప్రాంతాన్ని మూసేస్తున్నట్లు (Pakistan closes airspace) ప్రకటించింది. శనివారం వేకువజాము 3.15గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు గగనంతలం మూసేస్తున్నట్లు పాకిస్తాన్ పౌర విమానయాన అధికారులు పేర్కొన్నారు.
ఎయిర్ స్పేస్‌ని మూసేసి భారత్ దాడులను అడ్డుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. వైమానిక ప్రాంతాన్ని మూసేయడం వల్ల ఆకాశంలో యుద్ధ విమానాలు, మిసైళ్లు, డ్రోన్లు ఇలా ఏది కనిపించినా పేల్చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మండిపడ్డారు. భారత నగరాలపై డ్రోన్, మిస్సైల్‌లతో దాడులు చేస్తున్న పాకిస్తాన్.. ఎయిర్ స్పేస్‌నూ మూసేయడాన్ని మానేసిందన్నారు. పౌర విమానాలను రక్షణ కవచంగా ఉపయోగించుకోవడం స్పష్టంగా తెలుస్తోందని, ఇది ప్రమాదకరమైన వ్యూహంగా కనిపిస్తోందని చెప్పారు. భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో విమానాలు ఎగరడం సురక్షితం కాదని కర్నల్ సోఫియా ఖురేషి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి