Dharamasthala Case: ముసుగు వీడింది.. ఐడెంటిటీ బయటపెట్టిన సిట్..
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:01 PM
కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రంలో సామూహిత ఖననాలు చేశానంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన ముసుగు మనిషిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఇంతకాలం ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచిన పోలీసులు.. తాజాగా రివీల్ చేశారు.
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థల సమీపంలో వందలాది మంది మహిళల మృతదేహాలను పూడ్చానని తప్పుడు ఫిర్యాదులు చేసిన ముసుగు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బెల్తంగడి కోర్టు ముందు హాజరుపరిచింది. న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన అనంతరం నిందితుడి స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డు చేశారు. ఈ సందర్భంగా అతడి ముసుగు తొలగించారు పోలీసులు. ఇంతకాలం ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచిన పోలీసులు.. కోర్టులో అతడు మాండ్యకు చెందిన సిఎస్.చిన్నయ్యగా వెల్లడించారు.
ముసుగు మనిషిగా ఇన్నాళ్లూ వార్తల్లో నిలిచిన చిన్నయ్య అసలు ఫొటో ఇప్పుడు బయటికి వచ్చింది. ధర్మస్థలపై అనవసర ఆరోపణలతో కోరి చిక్కుల్లో పడ్డ ఫిర్యాదుదారు చిన్నయ్యను కస్టడీకి ఇవ్వాలని SIT కోర్టును కోరే అవకాశం ఉంది.