Maha Kumbha Mela 2025 : ఈ తప్పు మరో చోట జరగకూడదు.. ఢిల్లీ తొక్కిసలాట తర్వాత ఆ పని చేస్తున్న రైల్వే శాఖ..
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:39 PM
Maha Kumbha Mela 2025 : శనివారం ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఉన్నవారిలో 90 శాతం మంది మహాకుంభమేళాకు వెళుతున్నవారే. ఈ ఘటన జరిగి తర్వాత కూడా చాలా మంది ప్రయాణీకులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రైల్వే శాఖ అప్రమత్తమైంది.
Maha Kumbha Mela 2025 : ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఎంతమంది తమ అయినవారిని కోల్పోయారో తెలియదు. ప్రస్తుతం, తొక్కిసలాట ఎలా జరిగింది. ఏ నిర్లక్ష్యం వల్ల ఈ దుర్ఘటన జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తొక్కిసలాటలో ఉన్న వారిలో 90 శాతం మంది మహా కుంభమేళా కోసం ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వారే. ఇప్పటికే మహాకుంభమేళా చుట్టుపట్ల వేలాది వాహనాలు నిలిచిపోయాయి. 15 నిమిషాలు వెళ్లాల్సిన దూరానికి కూడా దాదాపు 3 గంటలు పడుతోంది. ఇంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ భక్తుల రద్దీ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. త్రివేణి సంగమంలో భక్త సంద్రాన్ని నియంత్రించేందుకు యూపీ ప్రభుత్వం ఒక పక్క చర్యలు తీసుకుంటుంటే, మరో పక్క రైల్వే శాఖ కూడా అప్రమత్తమైంది.
గత నెల జనవరి 13న ప్రారంభమైంది మహాకుంభమేళాలో ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నాలు చేశారు. ఫిబ్రవరి 26 చివరిరోజు కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు జనప్రవాహం ఆగటం లేదు. వేలాది వాహనాలు త్రివేణి సంగమం వైపు కదలుతున్నాయి. దీంతో ప్రయాగ్‌రాజ్ పొరుగు నగరాల్లోనూ భారీ ట్రాఫిక్ నెలకొంది. ప్రయాగ్‌రాజ్ సరిహద్దులో ఉన్న మధ్యప్రదేశ్‌లోని రేవాలో కూడా వాహనాల సంఖ్య గత 24 గంటల్లో విపరీతంగా పెరిగింది. ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనలో శనివారం 18 మంది చనిపోవడంతో ట్రాఫిక్ మరింత పెరిగింది. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్‌లోని వివిధ రైల్వే స్టేషన్లలో అలర్ట్ ప్రకటించారు.
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మహా కుంభమేళా వ్యవధిని పొడిగించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. గత సంవత్సరాల్లో మహా కుంభమేళా 75 రోజులు కొనసాగిందని, ప్రస్తుత షెడ్యూల్ తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. రోడ్లపై అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారని వారందరికీ పుణ్యస్నానాలు స్నానాలు చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Indian Deportees: పద్దతి మార్చుకోని యూఎస్.. కాళ్లకు, చేతులకు బేడీలు
Maha Kumbh 2025: కుంభమేళాకు అర్థమే లేదు.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు
Delhi Railway Station Stampede: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణం ఇదేనా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..