Egg Side Effects: ఈ 5 మందికీ గుడ్లు డేంజర్.. మీరూ ఈ లిస్ట్‌లో ఉన్నారేమో చెక్ చేసుకోండి!
ABN , Publish Date - Aug 28 , 2025 | 02:27 PM
ఆదివారం, సోమవారం అని తేడా ప్రతిరోజూ గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాము. కానీ ఇది అందరికీ వర్తించదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును, సంపూర్ణ ఆహారంగా పరిగణించే గుడ్డు ఈ 5 మందికీ విషంతో సమానమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటే గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డు అని తరచూ అంటుంటారు. ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్, ఉడికించిన గుడ్డు ఇలా ఏ రూపంలో తిన్నా మంచిదే అనుకుంటాం. అందుకే చాలా మంది ఉదయం అల్పాహారం మొదలుకుని సాయంత్రం స్నాక్స్ వరకూ ఏ సమయంలో అయినా గుడ్లను తినేందుకు ఇష్టపడతారు. కానీ ఇవి అందరికీ ప్రయోజనకరమేనా అని ప్రశ్నిస్తే ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు. వాస్తవానికి గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, ఈ 5 సమస్యలు ఉన్న వ్యక్తులకు గుడ్డు ప్రయోజనాలు అందించకపోగా హాని కలిగిస్తుంది.
జీర్ణక్రియ సమస్యలు
తరచుగా జీర్ణక్రియ సరిగా లేని వ్యక్తులు తమ ఆహారంలో గుడ్లు చేర్చుకోకూడదు. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి ఉన్నప్పుడు. గుడ్లు తినడం వల్ల కడుపులో భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వేడిని కలిగించే ఆహారం. కాబట్టి, వల్ల జీర్ణక్రియ మరింత కష్టతరం అవుతుంది.
గుండె వ్యాధులు
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కూడా గుడ్లకు దూరంగా ఉండాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడమే కాకుండా రక్త ప్రసరణలో అడ్డంకిని కలిగిస్తుంది .
ఊబకాయం
గుడ్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కాబట్టి బరువు తగ్గించేందుకు అవి ఉపయోగపడతాయని నమ్మితే పొరపాటే. నిజానికి, ఇందులో ఉండే ప్రోటీన్, కొవ్వులు బరువును మరింత పెంచుతాయి.
కిడ్నీ సమస్యలు
గుడ్లు ప్రోటీన్ కు మంచి మూలం కావడంతో వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి, కాబట్టి, మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉంటే గుడ్లు తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి, లేకుంటే ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు.
చర్మ సమస్యలు
తామర, మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు గుడ్లు తినకుండా ఉండాలి. సహజంగా వేడి స్వభావం ఉండటం వల్ల దీని ప్రభావం చర్మంపై కూడా కనిపిస్తుంది. గుడ్లు తిన్నప్పుడు సరిపడని పక్షంలో దద్దుర్లు, వాపు, దురద వంటి సమస్యలు రావచ్చు. చర్మం అనారోగ్యకరంగా కనిపించి ఇబ్బంది పెట్టే అవకాశమూ ఉంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
పాన్ కార్డ్ పోగొట్టుకున్నారా? వెంటనే ఇలా చేయండి.!
దిండ్లకూ ఎక్స్‌పైరీ డేట్.. ? గడువులోగా మార్చకపోతే ఈ సమస్యలు..!
For More Latest News